ఏపీ సర్కారు అమరావతి నిర్మాణం కోసం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానం సామాన్యులకు ఒక పట్టాన కొరుకుడుపడకుండా ఉంది. అంతే కాదు..చంద్రబాబు సింగపూర్ కన్సార్టియంతో కుదుర్చుకోబోతున్న ఒప్పందాలు కూడా సామాన్యుడికి అనేక సందేహాలు కలిగిస్తోంది. ఈ విధానం ద్వారా ఏపీకి ఒరిగేదేంటి.. అధికారాలు అన్నీ సింగపూర్ లో పెట్టడం ఏపీకి ఎలా లాభం చేకూరుస్తుంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.


అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు అవసరమైన బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం 5వేల 500కోట్లు ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయ్యింది. దీని ప్రకారం ఒప్పందం కుదిరిన మూడేళ్లలో ఏపీ మౌలిక సదుపాయాలు కల్పించకుంటే సింగపూర్ కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదన కంటే మెరుగ్గా ఇంకెవరైనా ప్రతిపాదన ఇస్తే దానికే ఏపీ సర్కారు మొగ్గుతుంది.


ఒకవేళ అదే జరిగితే.. సింగపూర్ కన్సార్టియానికి ఏడున్నర కోట్ల రూపాయల మేర ఏపీ పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.  ఈ స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ఏపీ దాదాపు 16 వందల ఎకరాలను సింగపూర్ కన్సార్టియానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ భూములను అమ్ముకునే హక్కు కూడా సింగపూర్ కు కల్పించడం అనుమానాస్పదంగా ఉంది. ప్రభుత్వమే మౌలికసదుపాయాలు కల్పించడం.. ఆ తర్వాత సింగపూర్ తో కలసి పెట్టుబడి పెట్టడం.. సింగపూర్ కు ప్లాట్లు అమ్ముకునే వీలు కల్పించడం ఏపీకి అంత లాభదాయకంగా అనిపించడం లేదు. ఈ విధానంపై ఇప్పటికే సర్కారు ప్రభుత్వ శాఖల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: