అసలు భారత్ కేమౌతుంది. సాంప్రదాయలకు, సంస్కృతికి, సంస్కారానికి మారుపేరైన ఈ దేశ ప్రజలిలా తయారవుతు న్నారెందుకో అర్ధం కావటంలేదు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లో జరిగింది. పదేళ్ల బాలుడిపై 16 ఏళ్ల అమ్మాయి అత్యాచార యత్నం చేయటం పోలీసులకు ప్రజలకు సర్వత్రా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆ బాలుడు తీవ్రంగా గాయపదటంతో  ఆస్పత్రిలో చేర్చారు. కాన్పూర్ సమీప గ్రామం కుల్హౌలి లో తన పక్క ఇంట్లో ఉండే పిల్లాడిని మాయమాటలు  చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ అమ్మాయి అతడితో బలవంతపు శృంగారానికి ప్రయత్నించింది. ఈ విఫలయత్నములో లో అతడి మర్మావయవాలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది.



దాంతో అతడిని కాన్పూర్లోని హాలెట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. బాధితుడితో పాటు నిందితురాలు కూడా మైనరే కావడంతో ఫిర్యాదు నమోదు చేయడం కష్టంగా మరిందని కాన్పూర్ సీనియర్ ఎస్పీ మాథుర్ అన్నారు. న్యాయ నిపుణులు మాత్రం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోస్కో చట్టంలోని 8వ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని చెబుతున్నారు.



సాధారణంగానే అసాధారణ నేరాలకు మైనర్లు లింగభెదం లేకుండా పాల్పడటం జాతికే అవమానం. ఇందులోని లైంగిక, నేరప్రవృత్తిపై మానశిక శాస్త్రవేత్తలు పరిశీలించటం అవసరం. ఈ మానసిక రుగ్మతలు ఏ దిశకు పయనిస్తాయో తెలియదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: