చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి ఓ స్టీల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కడపలో 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అంగీకరించారు. దీంతో కడపలో బ్రహ్మాండమైన స్టీల్ ఫ్యాక్టరీ రాబోతోందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ స్టీల్ కంపెనీ చరిత్రపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 

ఆ స్టీల్ కంపెనీ దివాళా తీసిందని.. చంద్రబాబును తప్పుదోవపట్టిస్తోందని సోషల్ మీడియాలో ఆర్టికల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అలాంటి ఓ కథనం ఎలా ఉందో చూడండి.. 


Ansteel ఒక దివాళా  తీసిన కంపనీ ....  
1997 మొదలు పెట్టిన ఈ Ansteel కంపెనీ గత 3 ఏళ్లగా  దివాళా తీసింది... 
ఏడాది క్రోతం ఈ కంపనీ share value 7.81 ఉంటె ఇప్పుడు అది 3.62 కి పడిపోయింది.... 
2013 లో sales revenue    $ 15,000,000. అంటే  దాదాపు  10 వేల కోట్లు  ఉండగా.... ఇప్పుడు అంటే 2016 మొదటి 3 నేలలకి  300 కోట్ల నష్టం తో నడుస్తుంది.... 
270 రోజుల పాటు బిల్లులు చెల్లించలేని వైనం... అందుకే వారిని suppliers బ్లాక్ list చేసారా ?? 

అసలా కంపెనీ మొత్తం విలువ 9000 కోట్లు అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 15 % ఉంటుంది.... 
2013 తరవాత ఆ కంపెనీ బోర్డ్ మీటింగ్ జరగలేదు...
ఇలా సాగుతున్నాయి సోషల్ మీడియాలో కథనాలు.. కేవలం కథనాలు రాయడమే కాదు.. వాటికి ఆధారాలంటూ లింకులూ ఇస్తున్నారు. 
ఆధారం 
for full details on Ansteel see the below link.. 

ఇక ఈ కథనాల్లో వాస్తవాలు పాఠకులే బేరీజు వేసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: