పేరుకి అధికార పక్ష ఎమ్మెల్యే నే కానీ కోర్టు లో ఆయనకు చుక్క ఎదురైంది. ఎంతవరకూ అంటే ఆయన బిల్డింగ్ ని కూల్చేయమనేంత వరకూ. విషయం ఏంటంటే తెలంగాణా లో అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి నాయకుడు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి కారు పార్టీ ఎక్కిన ఆయనకీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన భవనం కూల్చేయాలనే ఆదేశాలే కాకుండా, ఆయనకి చెందిన భవనం లో నడుస్తున్న కార్పరేట్ కాలేజీ ని వెంటనే ఖాళీ చేయించాలి అని పోలీసులకి కోర్టు ఆర్డర్ వేసింది.

 

 

 ఎమ్మెల్యే గారికి చాలా అక్రమ ఆస్తులు ఉన్నాయి అని హై కోర్టు లో చాలా పిటీషన్ లు వస్తున్నాయి. ఒకరి తరవాత ఒకరు బాధితులో లేక వారి బంధువులో ఈ పిటీషన్ లు వేస్తూ ఉండగా దీని మీద హై కోర్టు గత కొంత కాలంగా విచారణ జరుపుతూ వస్తోంది. అన్ని పిటీషన్ లనీ పరిగణ లోకి తీసుకున్న కోర్టు ఎమ్మెల్యే కి ఉన్న భవనాలు అన్నీ అక్రమాస్తులు అని తేల్చి వాటిని కూల్చేయ్యలని డిసైడ్ అయ్యింది.

 

 " అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా సరే కూల్చేయ్యల్సిందే. ఒక ప్రజా ప్రతినిధి ఇలా అక్రమ ఆస్తులు కలిగి ఉండడం ఇబ్బందికర విషయం; ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే ఏ అవకాసాన్నీ పోలీసులు ఊరుకోకూడదు .. " అంటూ కోర్టు పోలీసులకి హుకుం జారీ చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే భవనం కూల్చేయ్యలని హై కోర్టు స్వయంగా ఆర్డర్ వెయ్యడం తో ఇది ప్రస్తుతం సంచలన విషయంగా మారింది. సో మొత్తం అతని ఆస్థులలో ఒక భవనం కూల్చేయ్యబోతున్నారు .. కాగా మరొక భవనం లో ఉండే కాలేజీ ఖాళీ చేయించి సీజ్ చేసే అవకాశం ఉంది. పిటీషన్ లు పడుతున్నా కూడా పెద్దగా పట్టించుకోని అధికార పక్షం ఎమ్మెల్యే గారు ఒక్కసారి గా కోర్టు ఇలా తీర్పు చెప్పే సరికి షాక్ తిన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: