సింగపూర్ నుంచి దాదాపు 24 0 మంది ప్రయాణీకులతో బయలు దేరిన మిలన్ విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికి మంటలు రేగాయి. ఇంజిన్ లో ఒక్కసారి గా మంటలు రేగడం తో ప్రమాదాన్ని వెంటనే కనిపెట్టిన పైలెట్ చాకచక్యంగా వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసాడు. తెల్లవారు జామున 2.05 నిమిషాలకి సింగపూర్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ విమానం సింగపూర్ లోని చంగి ఎయిర్పోర్ట్ లో 24 0 ప్రయాణీకులని తీసుకుని ఇటలీ బయలుదేరింది.

 

 ఈ విమానం ఇంటర్నేషనల్ పరిధి గుండా మిలన్ చేరాల్సి ఉంది. టేకాఫ్ తీసుకున్న తరవాత విమానం ఇంజన్ లో భారీ సమస్య తలెత్తింది అని గమనించాడు పైలెట్. విమానం ఇంజన్ లో సమస్య వచ్చింది అనీ సింగపూర్ కి తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు అతను. విమానం ఆయిల్ లీక్ అవ్వడం వలన ఈ మంటలు రేగాయి. అంతమంది ప్రాణాలు తన చేతిలో ఉన్నాయి అని నమ్మిన ఆ పైలెట్ ఏ మాత్రం బెదరకుండా ఉదయం ఆరుగంటల యాభై నిమిషాలకి ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని అత్యవసరం గా దింపాడు.

 

 విమానం లో 222 మంది ప్రయాణీకులతో పాటు 19 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు అని వెంటనే మీడియా కి చెప్పింది సింగపూర్ ఎయిర్ లైన్స్. ఇలాంటి పరిస్థితి లో ఏం జరిగింది అని విమానం లో ప్రయాణీకుడు ఒకడు మండుతున్న ఇంజన్ ని వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టడం విశేషం .. పైలెట్ తెలివి తేటలు నేర్పు వలనే ఇదంతా సాధ్యం అయ్యింది అని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. తాము చనిపోయినట్టు దాదాపు గుర్తించాము అనీ కానీ అలాంటిది జరగకుండా పైలెట్ తమ ప్రాణాలు కాపాడాడు అని చెబుతున్నారు అందులో ప్రయాణం చేసినవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: