భారత్ లో “సామ్యవాద ఆర్ధికవ్యవస్థ” ను అంతమొందించి నూతన “సరళీకృత ఆర్ధిక వ్యవస్థ” ని నిర్మించి “అర్ధనీతి-రాజనీతి రెండు కళ్ళు” గా భాసిల్లిన ఒకే ఒక్క హిందీ యేతర భారత ప్రధాన మంత్రి,  దక్షిణ భారత నాయకుడు “పాములపర్తి వెంకట నరసిం-హారావు”  ఉరఫ్ “పివి” అఖిల భారత  కాంగ్రెస్  పార్టి  చేత చులకన గా చూడబడీ (అండర్-రేటెడ్),  ఆజన్మాంతం కాంగ్రెస్ వాడి గా జీవించిన నిస్వార్ధజీవి పివి.




హిందీ యేతరుడు, దక్షిణాది కి చెందినందుకు  దక్షిణ భారతదేశానికి, తెలుగువాడిగా పుట్టి నందుకు తెలుగు వాళ్ళ కు కీర్తి-ప్రతిష్ఠలు సంపాదించిపెట్టి, నాడు  దేశం బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి జాతి గౌరవం మంట గలిపినప్పుడు,  ప్రభుత్వం  మైనారిటీ లో  పడ్దప్పుడూ,  దానిని నిలబెట్టి పూర్తి కాలం నడిపించిన భారత సారధి కూడా పివి నే. సరళీకృత ఆర్ధిక విధానా లను ఆచరించి  మన దేశ గౌరవం విశ్వస్థాయిలో నిలబెట్టిన ఘనతరచతురుడు, తొమ్మిది భారతీయ భాషలు, ఎనిమిది విదేశీ భాషల్లో అనర్గళ ప్రావీణ్యమున్న బహు భాషాకోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి సాహితీ ప్రఖండుడు  పివి.  ఇన్నిమాటలెందుకు అలనాటి ఆర్య చాణక్యుడే మళ్ళీ పుట్టాడా అన్నట్లు “అపరచాణక్యుడై విలసిల్లిన దేశోద్ధారకుడు” మన ప్రధాని పివి.




న్యాయకోవిదుడు, ఉద్యమాలకు ఊపిరులూదిన పివి రచయిత కూడా. జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన విశ్వనాధ సత్యనారాయణ విరచిత సాహిత్య గ్రంధం "వేయి-పడగలు" నవలను హిందీ భాషలోకి "సహస్ర ఫణ్" పేరుతో అనువదించి దానికి సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన సాహితీ సుమం పివి.   పీవీ ని ఆధునిక చాణుక్యుడి గా అభివర్ణిస్తారు. దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లో మునిగిన సమయంలో ఆయన చూపిన చతు రత, చాణక్యం, దార్శనికత ఆధునిక సరళీకృత ఆర్ధిక విధానా లతో ఆధునిక భారతానికి బలమైన పునాదులు నిర్మించారు. అత్యంత కఠినమైనవిగా భావించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణ లను అతి సునాయాసం గా ఆచరణలోకి తీసుకురావటములో నాటి ఆర్ధిక శాఖామాత్యు డుగా ప్రముఖ ఆర్ధికవేత్త మన్మొహన్-సింగ్ ని ఎన్నుకోవటముతోనే ఆయన రాజ కీయార్ధిక వైవిధ్యం కనిపించింది.




రూపాయిని అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా విలువ లో మార్పుచేసి మనవిదేశీ వాణిజ్యాన్ని కొత్త పుంత లు తొక్కించి దానికి నడక, దౌడు, దృతి, పరుగు నేర్పిన చతురుడైన రౌతు పివి. 1940 ప్రాంతము లో నిజాం కర్కశ పాలనకు ఎదురొడ్దినిలిచిన ధీరత్వంతోపాటు, 1947 స్వాతంత్రం కోసం ఆ తరువాత, భూసం -స్కరణల కోసం రెండు బలమైన తెలుగు రాజకీయ వ్యవసాయం కులాల మధ్య నలిగి పోయినా బెదరకుండా,  ముఖ్యమంత్రి పదవినే ఫణంగా పెట్టిన ధీశాలి కూడా పివినే. ఎమర్జెన్సి తరవాత ఇందిరా గాందికి దన్నుగా నిలిచి పరిపాలన చేసిన అపర చాణక్యసచివుడు పివి. సార్క్ దేశాలకు నాయకత్వం, విశ్వంలో ఉనికి నివ్వటము లో పివి పాత్ర చిరస్మరణీయం.




ఇందిరాగాంధి దుర్మరణానంతరం రాజీవ్ గాంధి ని వెనక ఉండి పరిపాలన చేసింది పివినే. ఈ విధంగా ఆరు దశాభ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రత్యక్ష, పరోక్ష పాలన నిర్వహించింది పివినే. ఆ తరవాత విధిలేని పరిస్థితిలో భారత రాజకీయాల్లో మైనారిటీ స్టాటుస్ లో ఉన్న కాంగ్రెస్ తో ఫుల్-టైం పరిపాలించిన ఘనత పివి నేతృత్వములోనే సాధ్యమైంది. మనదేశమంటే విదేశాలకు ప్రత్యేకించి శతృదేశాలకు వెన్నులో చలి పుట్టించిన పోఖ్రాన్ నూక్లియర్ టెస్ట్ వాజపేయె ప్రభుత్వానికి దన్నూ, నేపధ్యం రచయిత పివినే. అంత్యకాలంలో తనవారసుల అక్రమ అవినీతి కార్యక్రమాల వలన సర్వం కోల్పోయి స్వంత ఖర్చులతో పునీతుడు గా బయటపడ్డ పివి, ఆర్ధికంగా ఆదుకోకుండా సోనియా అధినేతృత్వ కాంగ్రెస్ ఆయన పట్ల అత్యంత దయనీయంగా సంస్కారరహితంగా ప్రవర్తించింది. ఆయన దహన సంస్కారాలు దిల్లీలో జరగవలసి ఉన్నా కక్షా కార్పణ్యాలతో గాంధి భవనంలోకి కూడా ఆయన పార్ధివ దేహాన్ని అనుమతించలేదు సరికదా, దేహం పూర్తిగా దహనం అవ్వకుండానే వైఎస్ రాజసేఖరరెడ్డి నాయకత్వం పివి అంతిమ సంస్కారాలను ముగించింది.




చాణక్యశపధాన్ని గుర్తుకు తెచ్చేలా దహించబడుతున్న ఆయనదేహం పైకి లేచిందని, ఆ శాపమే వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత దురదుష్టకర దుర్మరణం సంభవించిందంటారు కొందరు ఆధ్యాత్మికవాదులు. పివి నరసిం-హారావు గారి 95 వ జన్మ దినం సంధర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. స్మరించుకుందాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: