హైదరాబాద్ లో జీడిమెట్ల ఇండస్ట్రీయల్ ఏరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాస్తవానికి ఇండస్గ్రీయల్ ఏరియాల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరుచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వేసవి కాలంలో జరుగుతుంటాయి. బుధవారం వేకువ జామునే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకోవడంత ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. స్థానిక గంపలబస్తీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ స్తాయిలో మంటలు చెలరేగాయి..దీంతో అక్కడి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.  

ఫ్యాక్టరీకి అగ్ని ప్రమాదం సంబవించిందని సమాచారం తెలుగుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మంటలతో చుట్టు పక్కల ఉన్న ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యా..అక్కడి వాతావరణం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అయితే ఇక్కడి ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు గురికావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..అగ్నిప్రమాదాల సంబవించకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా యాజమాన్యాలకు చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: