చంద్రబాబు, ఆయన కేబినెట్ రాజధాని అమరావతిలోని కీలక భాగాన్ని సింగపూర్ కన్సార్టియంకు రాసిచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కేబినెట్ మీటింగులో నిర్ణయం తీసేసుకున్నారు కూడా. అయితే ఇదంతా బిగ్ స్కామ్ అని.. సింగపూర్ కంపెనీలతో బాబు కుమ్మక్కయ్యారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

ప్రతిపక్షాల విమర్శలు కామనే అయినా ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని స్వయంగా ఆయన ప్రభుత్వంలోని అధికారులే తప్పుబడుతున్నారు. ఇంత దారుణంగా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అమరావతి నిర్మాణానికి సింగపూర్ కన్సార్టీయం పెట్టిన నిబంధనలపై పలు ప్రభుత్వ శాఖలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.


ప్రధానంగా ఆంధ్రా  ప్రభుత్వం ఇచ్చిన భూమిని తనఖా పెట్టుకునే అధికారం కన్సార్టీయంకు ఉండటం ప్రమాదకరంగా భావిస్తున్నారు. అంతే కాదు.. సదరు అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తుగా ఉండటం ఏమిటని ఆర్థిక శాఖ అభ్యంతరం చేబుతోంది. అంతే కాదు.. సరిగ్గా మంత్రివర్గ సమావేశానికి ఒకటి, రెండు రోజుల ముందే వీటిని పరిశీలన కోసం పంపించడం ఏంటని నిలదీస్తున్నారు. 

ఈ నిబంధన ముందు ముందు ఆంధ్రా రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కారణాలతో ప్రాజెక్టు ఆగిపోయినా ఉమ్మడి సంస్థ చేసిన ఖర్చు, అప్పులను ఏపీ సర్కారు చెల్లించమనటాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ తప్పుబడుతోంది. రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిధిని దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి సంస్థ తీసుకునే అప్పులకు పూచీ ఉండటం సాధ్యపడక పోవచ్చని ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: