బ్లాక్ మనీ.. మనదేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. పన్నుల పరిధిలోకి రాకుండా దర్జాగా అనుభవంచి ఇలాంటి నల్ల ధనం ద్వారా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అందుకే నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 

అందులో భాగంగానే నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసుకునే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పిస్తోంది. నిర్ణీత గడువులోగా బ్లాక్ మనీ వెల్లడిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకోబోమని.. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అడగబోమని మోడీ సర్కారు భరోసా ఇచ్చింది. ఇప్పుడు జైట్లీ కూడా అదే డైలాగ్ కొడుతున్నారు. 


సెప్టెంబర్ 30 ఆఖరి గడువును నల్లకుబేరులు యూజ్ చేసుకోవాలని అరుణ్ జైట్లీ పిలుపు ఇస్తున్నారు. ఒకేసారి చెల్లింపు పథకాన్ని వినియోగించుకొని పన్ను భారం నుంచి బయటపడాలని పన్ను ఎగువేతదారులకు హితవు పలికారు. ఆస్తులు వెల్లడించని వారి వివరాలు చేతులు మారబోవని.. ప్రభుత్వంలోని వేరే సంస్థలకూ వాటిని ఇవ్వబోమని జైట్లీ హామీ ఇస్తున్నారు. 

సెప్టెంబర్ 30 ఆఖరి గడువేనని.. దాన్ని ఇంకా పొడిగించే అవకాశం లేదని జైట్లీ తేల్చి చెప్పారు. అలాంటి పుకార్లు అస్సలు నమ్మవద్దంటున్నారు జైట్లీ. పన్ను నిపుణులు నల్ల కుబేరులను తప్పుదోవపట్టించకుండా వారితో నల్లధనం వెల్లడింపజేయాలని సూచిస్తున్నారు. కేంద్ర పన్నుల విభాగాధిపతులు, పారిశ్రామిక నిపుణులు, వాణిజ్య సంఘాలు, సీఏ, పన్నునిపుణులతో జైట్లీ సమావేశమయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: