కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటుంది. వాటిలో రాష్ట్రాలకు ఉపయోగపడేవాటిని పసిగట్టి.. వాటి నుంచి ఎక్కువ లబ్ది పొందడం ద్వారా రాష్ట్రప్రభుత్వాలు తమ ప్రజలను ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి విషయాల్లో ఏపీ సర్కారు కాస్త ముందంజలో ఉంటుంది. గతంలో 24 గంటల విద్యుత్ పథకాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. 

తాజాగా.. సామాన్య ప్రజలకు ఔషదాలు తక్కువ ధరల్లో అందజేయాలనే సంకల్పంతో ప్రధాని మోదీ రూపొందించిన ప్రధాని జన ఔషధి దుకాణాల పథకాన్ని కూడా ఆంధ్రా సర్కారు అందిపుచ్చుకుంటోంది.  ఈ ఆర్ధిక సంత్సరంలో దేశ వ్యాప్తంగా మూడు వేల జన ఔషధి దుకాణాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏపీ కేంద్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 


కేంద్ర మంత్రి అనంతకుమార్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు ఈ మేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి జన ఔషధ దుకాణాలు నెలకొల్పుతారు. దాదాపు 600 రకాల మందులు ఈ షాపుల్లో అందుబాటులో ఉంటాయి. సామాన్యప్రజలకు తక్కువధరకే నాణ్యమైన మందులు అందుతాయి. 

ఈ 600 రకాలను క్రమంగా 1000 రకాల వరకూ పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తొలివిడతలో ఈ జన ఔషది దుకాణాలను నెలకొల్పబోతోంది. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాన్యులు నివసించే ప్రాంతాల్లో జన ఔషధ మందుల షాపులు ఏర్పాటు చేస్తారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: