అరవింద్ కేజ్రీవాల్.. రాజకీయ నాయకుడిగా మారిన ఒకప్పటి ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇప్పుడు తన రాజకీయ పార్టీని విస్తరించేందుకు వ్యహాలు రచిస్తున్నాడు. ఢిల్లీ రాష్ట్రంలో తిరుగులేని పట్టు సాధించిన ఈ కుర్ర రాజకీయ వేత్త.. ఇప్పటికే పంజాబ్ పైనా  దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన మరో ముందడుగు వేసినట్టు కనిపిస్తున్నారు. 

గోవాలో పర్యటించిన అరవింద్ కేజ్రీవాల్.. అక్కడ వ్యవస్థీకృతంగా మారిన సెక్స్ టూరిజం గురించి గట్టి గా మాట్లాడారు. గోవా.. సెక్స్ టూరిజం, వ్యభిచారం, మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని ఘాటు పదజాలంతో విమర్శించారు. ఈ అక్రమాలకు రాజకీయ పార్టీల ప్రాపకం, అధికార పెద్దల మద్దతు ఉందని అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆమ్ ఆద్మీని దేశమంతా విస్తరించే ఆలోచనలో ఉన్న కేజ్రీవాల్ ప్రస్తుతం గోవా వంటి చిన్న రాష్ట్రాలపై కన్నేశాడు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఇప్పటికే పక్కా ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే గోవాలో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఇప్పటికే ఢిల్లీ వంటి నగర ఓటర్లను ఆకర్షించడంలో కిటుకులు కనిపెట్టిన కేజ్రీవాల్.. అదే చాణక్యనీతిని గోవాలోనూ రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన సక్సస్ అయితే.. బీజేపీ చేతుల్లోంచి గోవా ఆమ్ ఆద్మీ చేతుల్లోకి రావచ్చు. కానీ గోవాలో ఇప్పటికే బలంగా ఉన్న బీజేపీ.. కేజ్రీవాల్ కు అలాంటి ఛాన్స్ ఇస్తుందా..?



మరింత సమాచారం తెలుసుకోండి: