సాక్షి మీడియా.. ఏపీలో చంద్రబాబు సర్కారుకు కంటిమీద నిద్ర కరవు చేస్తున్న మీడియా ఇది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు చెందిన ఈ మీడియా ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు భారీగా ప్రచారం కల్పిస్తోంది. అందుకే ఈ పత్రికపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పలుసార్లు మండిపడ్డారు. 

జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షి మీడియా ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే సాక్షి మీడియాకు చెందిన కొన్ని ఆస్తులు జప్తు అయ్యాయి. ఇటీవల సాక్షి మీడియా చంద్రబాబు సర్కారును ఉతికి ఆరేస్తుండటంతో సాక్షిని త్వరలోనే మూసేయిస్తామని మంత్రులు బహిరంగంగానే కామెంట్లు చేసే పరిస్థితి వచ్చేసింది. 


తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు 750 కోట్ల రూపాయల విలువ చేసే జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తాజాగా సర్కారు జప్తు చేసిన ఆస్తుల్లో సాక్షి టవర్స్ కూడా ఉండటం విశేషం. బంజారాహిల్స్ లోని ఈ సాక్షి టవర్స్ల్ లోనే సాక్షి టీవీ, పత్రిక పని చేస్తున్నాయి. తాత్కాలికంగా జప్తు చేయడం వల్ల ఈ టవర్స్ కు ఈడీ తాళం వేసే అవకాశాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత జగన్ అక్రమ పునాదులు కూలినట్టేనని మంత్రి రావెల కిషోర్‌బాబు కామెంట్ చేశారు. త్వరలో జగన్ జైలుకెళ్లడం, సాక్షిని మూసేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాజధాని నిర్మాణంపై సాక్షి అనుచిత రాతలు రాసిందని రావెల గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తే సాక్షి మూసివేతకు రంగం సిద్ధమైనట్టు లేదూ.. 



మరింత సమాచారం తెలుసుకోండి: