ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఈ పరీక్ష ప్రక్రియ మొత్తం మూడు నెలల్లోపు పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీలకు ఆదేశాలు జారీ చేసింది. 

2012లో జరిగిన ఈ మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ తప్పుల కారణంగా మళ్లీ నిర్వహించాలని అప్పట్లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. రాష్ట్ర విభజనను సాకుగా చూపుతూ ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తూ వచ్చింది. కానీ ఏపీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరి కారణంగా గ్రూప్ 1 మెయిన్స్ కోల్పోయిన అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటీషన్ వేసి పోరాడటంతో ఈ  తీర్పు వచ్చింది.


వాస్తవానికి ఈ పరీక్ష పూర్తయి.. 606 మందికి ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. ఏపీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇప్పుడు వారు కూడా మళ్లీ పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు ఈ పరీక్షను ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీ వేరు వేరుగా నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా పోస్టుల విభజన కూడా జరిగింది. 



ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన నోటిఫికేషన్లోని మొత్తం 312 పోస్టులను ఆంధ్రప్రదేశ్‌కు 172, తెలంగాణకు 140 పోస్టులను కేటాయించారు. కేసు విచారణలో ఉండగా ఒక గణనీయమైన మార్పు జరిగింది. రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు వాస్తవం. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు పబ్లిక్‌ సర్వీసు కమిషన్లు ఉన్నాయి. కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఉమ్మడి పరీక్ష నిర్వహించేలా ఏపీని ఆదేశించాలంటూ మీరు సమస్యను సృష్టిస్తున్నారు. మేం అలా ఆదేశించలేం  అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి అని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: