అధికార గర్వంతో చంద్రబాబు దేవుళ్లతో సైతం చెలగాటం ఆడుతున్నారని వైసీపీ మండిపడుతోంది.  అభివృద్ధి పేరుతో దేవాలయాలను, మసీదులను కూల్చడం దారుణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారులను అర్థరాత్రి పూట అరెస్ట్ చేసి మరీ గుళ్లను కూల్చేయడం దుర్మార్గమన్నారు.

చంద్రబాబు సర్కారు మత భావాలను ప్రభుత్వం ఏమాత్రం గౌరవించడం లేదని పార్థసారథి ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం హిందూ, మైనారిటీ మత భావాల మీద ప్రభుత్వం దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ శాసనమండలి సభ్యుడి ఆస్తులను కాపాడడం కోసం గోశాల, గోశాలలోని కృష్ణ ఆలయాన్ని కూల్చేయడం దుర్మార్గమన్నారు.  


దేవాలయ భూములు అమ్మకూడదు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాదని ఆదేశాలు ఉన్నప్పటికీ టీడీపీ నిబంధనలను ధిక్కరిస్తోందన్నారు. మహాత్ములు, పూర్వీకులు దేవాలయాలకు సంబంధించి అప్పగించిన భూములను సైతం టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు ఎడాపెడా దేవాలయ భూములను అమ్ముకోవడం తగదని కోర్టులు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. 

ప్రభుత్వ అవసరాల కోసం గోశాల భూములను తీసుకుంటూ, ఇరిగేషన్ భూమిని గోశాలకు అప్పజెప్పారని ...కృష్ణ దేవాలయానికి ఎలాంటి హాని కలిగించమని గోశాల నిర్వాహకులతో ఎంవోయూ కూడా చేసుకున్నారని పార్థసారథి గుర్తు చేశారు. కానీ ఒప్పందాన్ని ధిక్కరించి ఆలయాన్ని ఏవిధంగా కూలుస్తారని టీడీపీ సర్కార్ పై పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రజలకు అసౌకర్యంగా లేకపోయినా, అభివృద్ధికి ఎలాంటి ఆటంకంగా లేకపోయినా... మతపరమైన భావాల్ని గౌరవించకుండా ఉద్దేశ్యపూర్వకంగా హాని చేయడం దారుణమని పార్థసారథి ఫైర్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: