నిరంతరం ఎదో ఒక దేశం సందర్శిస్తున్న తెలుగు రాష్ట్రాల మంత్రులు పెట్టుబడుల మీద బాగా దృష్టి పెట్టారు. సింగపూర్ వెళ్ళిన తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ కదులుతున్నారు. ఆయన రోజులన్నీ అక్కడ బిజీ బిజీ గా నడుస్తున్నాయి. ఏ స్టార్ కంపెనీ తో ప్రత్యేక సమావేశం లో పాల్గొన్న ఆయన సింగపూర్ లోనే అతి పెద్ద ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల కంపెనీ తో కలిసి పనిచెయ్యాలని కోరుకుంటున్నాం అని కోరారు. దానికి వారి నుంచి కూడా మంచి సుముఖత వ్యక్తం అయ్యింది. తెలంగాణా ప్రభుత్వం - ఏ స్టార్ ఇరువురూ కలిసి ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

 

 దీని వలన తెలంగాణా ప్రాంతం లో చాలా బెనిఫిట్ లు ఉంటాయి అని తెలుస్తోంది. ఏ స్టార్ కంపెనీ చేసే ప్రతీ పరిశోధన , ఇంక్యూబేషన్ , వాణిజ్య వ్యవహారం వెనకా తెలంగాణా ప్రభుత్వం ఉంటుంది. ఇన్నోవేషన్ రంగం లో కూడా విద్యా రంగం తో పాటు పరిశ్రమల రంగానికి తెలంగాణా వారధి గా నిలుస్తుంది. సింగపూర్ , తెలంగాణా విద్యార్ధుల మధ్యన ఎక్స్ చేంజ్ ప్రోగ్రాం లు కూడా త్వరలో నిర్వహిస్తారు. తెలంగాణా లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్న ఆ సంస్థ తో తెలంగాణా లో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన రంగ అభివృద్ధి, చిన్న పరిశ్రమల ఏర్పాటు గురించి వివరించారు.

 

 

 దాదాపు 18 సింగపూర్ కంపెనీల సీయీవో లతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్ బిజినెస్ సెషన్ లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణా లో ప్రస్తుతం ఉన్న ఐటీ పాలసీ ల మీదా ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశ్రామిక విధానం మీదా భారీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందించారు మంత్రి. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచీ ఇప్పటి వరకూ 2200 కంపెనీలకి తాము ఏ విధంగా అనుమతుల ప్రక్రియ అందించామో , ఏ రకంగా ఇది సాధ్యపడిందనే విషయాల మీద కేటీఆర్ ఈ ప్రెజెంటేషన్ లో పొందు పరిచారు. తెలంగాణా ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ పెట్టుబడులకి ఆకర్షణీయ ప్రదేశం అనీ పారదర్సకమైన ప్రభుత్వం ఉండడం అన్నిటినీ మించిన ప్లస్ పాయింట్ అనీ మంత్రి మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: