వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘రాయలసీమ స్ట్రాంగ్ మ్యాన్’గా నెటిజన్లు పిలుచుకుంటారు. ఇటీవల జగన్ పేరును సెర్చి చేసిన అత్యధికులు ఈ పేరుతోనే నెట్ లో ఆయనను చేరుకున్నారు. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మొన్న ఒకే దఫాలో రూ.750 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం ఆయనను బెంబేలెత్తిస్తోంది. దాదాపు రూ. 750 కోెట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. తన భవిష్యత్‌ను తెలుసుకునేందుకు జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నట్లు తెలియవచ్చింది. తన పర్యటన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని లోటస్‌పాండ్‌.. తన నివాసానికి జ్యోతిష్యులను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. 



నిన్న తన లోటస్ పాండ్ నివాసానికి జ్యోతిష్కులను రప్పించిన జగన్... వారితో దాదాపుగా 3 గంటల పాటు తన భవిష్యత్తుపై మంతనాలు జరిపారట. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కొన్ని దోష నివారణ చర్యలు చేపట్టక తప్పదని జ్యోతిష్కులు ఆయనకు సూచించినట్లు వార్తలు వినవస్తున్నాయి. జ్యోతిష్కులతో మంతనాల నేపథ్యంలో నిన్న ఆయన తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. అలాగే న్యాయ సలహాదారులతో మంతనాలు జరిపినట్లుగా తెలియవచ్చింది. అనంతరం కొంతమంది మత పెద్దలతో కూడా జగన్ భేటీ అయినట్లు తెలియవచ్చింది.


మొన్న ఇఫ్తార్ విందులో ఉండగా... ఈడీ అటాచ్ మెంట్ విషయం తెలియడంతో ఒక్కసారిగా జగన్ ముఖ కవళికలు మారిపోయాయి. తాజాగా ఆయన ‘జ్యోతిష్యం’ బాట పట్టారు. గడచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత జ్యోతిష్కులతో భవిష్యత్తు చెప్పించుకున్న జగన్... 2016 జూన్ లో తనకు మంచి రోజులని తెలుసుకున్నారు. అందుకే, 2019 దాకా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ప్రజలు అధికారం కట్టబెట్టినా... మరో రెండేళ్లలో అధికారం మనదేనంటూ ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. అయితే 2016 జూన్ వచ్చింది. వెళ్లింది కూడా. అయితే జగన్ కు మంచి రోజులు కాదు కదా... మరింత గడ్డు రోజులొచ్చాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: