భారత్ అంతటా వయసుతో సంబందం లేకుండా స్త్రీ జాతిపై అత్యాచారాలు, దైహిక హింస, లైంగిక దోపిడీ, మానసిక హింస, అరాచకాలు అలవోకగా జరిగిపోతున్నాయి. రక్షించవలసిన రక్షక భటులు, ఉన్నత పదవుల్లో ఉండీ అదేశాలిచ్చే అధికారులు, ధర్మాన్ని, న్యాయాన్ని, కనీసం చట్టాలనైనా పరిరక్షించే భాధ్యత ఉన్న న్యాయా ధిపతులు, శాసనసభల్లో శాసనాలు చేసే ప్రజా ప్రతినిదులూ కూడా వీటికి అతీతం కాకుండా ఉండలేక పోతు న్నారు. భారత రాజ్యాంగం చెప్పక పోయినా నాలుగవస్థంబం గా తమని తామే చెప్పుకునే  ప్రసార-మాధ్యమా లూ ఇందు లో భాగస్వామ్యమైన సంధర్భాలు అనేకం. సాంస్కృతికంగా, సామాజికంగా, సాంకేతికంగా, అనేకా నేక శాస్త్రాలలో, విద్యాబుద్దులలో, విశేషంగా ఆధ్యాత్మికంగా ఎంతగానో ఎదిగిన భారత వర్షం ఈ ఆటవిక అనాగరి కత తో కూడిన దుస్థితి నెందుకు ఎదుర్కోవాలో తెలియని పరిస్థితు లెందుకు దాపురించాయో అర్ధంకాదు.




దేహమంతా రక్తసిక్తమై, ముప్పైకి పైగా గాయాలు, వీపుపై రక్కిన, గీరిన గోళ్ళ ఆనవాళ్ళు, కడుపునుండి బయటపడి వేలాడే ప్రేగులు తో అతి భయానకమైన భీకర లైంగిక దాడికి గురైన ఒక 30 యేళ్ళ మహిళదేహం - ఎర్నాకులానికి దగ్గరలోని పెరంబవూరు దగ్గర, అదీ ఆ మహిళ స్వగృహంలో  జరిగిన సంఘటన, ఆ స్త్రీ అలా అచేతనంగా పడి ఉండటాన్ని ఆమె తల్లి వచ్చి గుర్తించేంతవరకు వెలుగులోకి రాలేదు.





నేటివరకు ఇలాంటి ధుర్ఘటనలు నగరాల్లోనూ, అదీ ఉత్తరభారతంలో మాత్రమే బయల్పడేవి. వెలుగు చూసేవి. కాని ఈ ఘటన దక్షిన భారతంలో అదీ 94% అక్షరాస్యత కలిగిఉన్న "గాడ్స్ ఓన్ కంట్రీ" (దేవతల జన్మ భూమి)  అన బడే కేరళ లో జరిగింది. అదీ మారు మూల పల్లెటూళ్ళో. మరణానికి ముందు ధారుణంగా లైంగికంగా భౌతికంగా హింసకుగురై గొంతునులిమి ఏదో కసి కక్ష కార్పణ్యాలతో చంపబడ్డట్టు 30 కిపైగా కత్తిపోట్లో లేదా పదునైన వస్తువుతో కడుపుచించి ప్రేగులు బయటకు తీసి వికృత విన్యాసానికి గురై నరక యాతన చవిచూసి నట్లు కనిపించింది. చూపరులకు సైతం హృదయవిదారక దయనీయ దృశ్యం కనిపించింది. "జిష" పేరుతో మీడియాలో పిలవబడుతున్న ఈ మహిళ హృదయవిదారక మరణం 2012 లో డిల్లీ బస్లో సామూహిక మానభంగం ఆ తరువాత ఇదేవిధంగా చంపబడ్డ నిర్భయ ఉదంతపు అతిదగ్గర  పోలికలు ఈమె కేసులో కూడా కనిపిస్తున్నాయి. అయితే నిర్భయ ఉదంతం ఒక్క సారిగా అగ్ని రాజుకున్నంత వేగంగా ప్రాంతీయంగా, దేశవ్యాప్తంగా, విశ్వవ్యాపితమై సోషల్ మీడియా సపోర్ట్ తో దోషులను నేరస్తులుగా ప్రజావాహిని ముందు నిలబెట్టేవరకు ఒక ఉదృత ప్రవాహములా ఒక ఉద్యమంగా కొనసాగింది.




ఈ సంవత్సరం ఏప్రిల్ చివరివారములో జరిగిన ఈ జిష పై అత్యాచారం సంఘటన వెలుగులోకి రావటానికి చాలా సమయ ఎందుకు తీసుకుంది? వెంటనే దుర్ఘటన వార్తల్లో ఎందుకు రిపొర్ట్ కాలేదు? పోలీసు ఎక్కడ ఉన్నారు? ఎం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయములో వెంటనే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కలగ చేసుకో లేదు? అనేక ప్రశ్నలు.





నిర్భయ విషయం దేశవ్యాప్త ఉద్యమానికి స్త్రీల హక్కుల పరిరక్షణ, రక్షణ లాంటి విషయాలను బలంగా తట్టిలేపి, ఉదృత ఉద్యమమై ఉత్తుంగ తరంగములా ఎగసిపడి ఊరూ, వాడా ఏకమై పోరాటపటిమంటో ఏమిటో ఋజువు చేస్తే, అలాంటి పోలికలున్న ఈ కేసు ఎందుకంత నిర్లిప్తంగా ముందుకు నడుస్తుందో అర్ధం కాదు. లోపమెక్కడ ఉంది. ప్రాంతములోనా?  ప్రజల్లోనా? కులంలోనా? మతములోనా?  ఆర్ధిక ఆధిఖ్యతలోనా?  అక్షరాస్యతలోనా? ఎక్కడ-ఎక్కడ ఎవే ప్రశ్నలు ఏటి చలమలో నీరూరినట్లు ఊరుతుంటాయి? నిర్భయ ఒక పారా-మెడికల్ విద్యార్ధి ని. జిష ఒక న్యాయ వాది. అక్షరాస్యతలో జిష ఒక అడుగు ఎక్కువే. 




నిర్భయ సంఘటన దేశ రాజధానిలో జరగటం ప్రపంచానికి ఫొకస్ అయిందంటారు. అయితే జిష రేప్ సంఘటన ఒక మూలన ఉన్న బాక్-వాటర్స్ వద్ద జరిగింది అంతే కాదు ప్రజలకు విపరీతంగా ఫోకస్ అయ్యే విశ్వ, మహా నగరాల్లో అపరాధ నేరపరిశోధనలు వేగవంతంగా చేసే అవసరం రాజకీయనాయకులకు అధికార్లకు తప్పదు. ఇక్కడి ఘటనలు తక్షణం న్యాయవ్యవస్థ దృష్టిలోకి వెళ్ళిపోతాయి. అందుకే నగరాల్లో అన్నీ వ్యవస్థలు వెంటనే స్పందిస్థాయి. ఇందువల్లే నగరాల్లో జరిగే రేపుల రెపోర్టింగ్ వేగంగా జరగటం సోషల్ మీడియా ఫాలొ-ఆప్ చేస్తుండటం వలననే విశ్వం దృష్టిలో ప్రశ్నార్ధక మవటం సర్వ సాధారణంగా జరుగుతుంది. అంటే కాదు నగర పట్టణ ప్రాంతాల్లో ప్రజలనుంది నిరసనలు, ఉద్యమాల సెగ తప్పదు. అయితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో త్వరగా స్పందించే వ్యవస్థలు ఉండవు. నాయకులనుండి, న్యాయస్థానాలనుండి, సోషల్ మీడియా నుండి సెగ తగిల్తే తప్ప మరీ ఫోకస్ కావు. అందుకే పోలీసులూ అలసత్వం నిర్లక్ష్యం చేయటం సర్వసాధారణం. అందుకే గ్రామీణ భారతములో జరిగే వనితలపై అత్యాచారాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా అవి అంత ప్రభావం చూపిం చవు. జిష విద్యావంతురాలు, అందునా లాయరవ్వటం తో ఈమాత్రమైనా కేసు చర్చకు వచ్చింది.  నగరాల్లో కంటే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలపై జరిగే కిరాతకాలే ఎంతో ఎక్కువ.




నేషనల్ క్రయిం రికార్డ్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) వద్ద లభించే వివరాల ప్రకారం రోజుకు భారత దేశ వ్యాప్తంగా 92 మంది స్త్రీలు మానభంగాలకు గురౌతున్నారు. ఒక్క డిల్లీ నగరం లోనే రోజుకు నలుగురు మహిళలు మానభంగా లకు గురౌతున్నారు. దేశవ్యాప్తంగా 2012 లో 24923, 2013 లో 33707 మానభంగాలు జరిగినట్లు రికార్డులు చెపుతున్నాయి. అందులో 15556 కేసుల్లో భాదితులు 18 తొ 30 సంవత్సరాలో వయసున్నవారే. డిల్లిలో 2012 లో 706  2013 లో 1636 రేపుల సంఖ్య ప్రతియేడాకి రెట్టింపవుతుంది. ముంబాయి లో 192, జయ పూర్ లో 172, పుణెల్లో 171 కేసులు రెపోర్ట్ అయ్యాయి.  అందునా భాదితులకు దగ్గరి బందువులు తెలిసిన వారే  94%  ఇందులో నేరస్తులుగా నిర్ధారణవటం ఆందోళన కలిగించే అంశం. ఒక యేడాది జరిగిన 18171 కెసుల్లో నెరస్తులు 539 మంది పేరెంట్స్, 10782 మంది ఇరుగుపొరుగు వారు, 2315 మంది మిగిలిన వారు ఇతరులు. ఇదెంత ఆందోళన కలిగించే విషయమో ఆలోచించాల్సిందే.




దేశములో జరిగే రిపోర్ట్ అయిన మానభంగాలు నగరాలలో జరిగే వాటికంటే ఏడు రెట్లు ఎక్కున ఉంటుందని, కాని పోలీసులు ఎంపిక చేసుకున్న వాటినే పరిశోదిస్తున్నట్లు బావించవలసి వస్తుంది. గతచరిత్రలో అంటరాని తనానికి గురైన కులానికి చెందిన దళీత యువతి జిష. ఆమె తల్లి ఇరుగుపొరుగు వారు ఇచ్చిన పిర్యాదుపై నాలుగైదు రోజులు పొలీసులు స్పందించక మిస్సింగ్ (ఇన్విజిబుల్)  కేసుగా పరిగణించారు. కాని ఇన్విజిబులు గా కాలగర్భములో కలవవలసిన ఈ కేసు ఎప్పుడైతే జిష చదువుకున్న లా కాలేజీ టీచర్ళు, విద్యార్ధులు నిరస నలతో మీడియా ముందుకు తీసుకురావటముతో వెలుగు చూసింది.




పోలీసులు మీడియాకు స్పందించక తప్పలెదు. ఆమె తల్లి మనస్థిమితం లెనిదని చెప్పి తమ నిర్లక్ష్యాన్ని కప్పిపెట్టి, కేరళ ఎన్నికల రణరంగం మద్య లో నిలబడ్డ రాజకీయ నాయకులు వారి వారి మైలేజు కోసం కేసుని ఎవరికి తగ్గట్టు వాళ్ళు కెలికేసి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకు తావటంతో 21 జూన్ 2016 న అంటే నేరం (ఏప్రిల్ 28, 2016 న జరిగింది) జరిగాక రెండునెలలకు తొలి అరెష్టు జరిగింది. పోలీసుల స్పందన లోపానికి కారణం బాదిత యువతి దళిత కులానికి, బాగా వెనుకబడ్డ కులానికి చెందటమే కారణం. చట్టపరంగా వీరికి రావలసిన హక్కులు చేరకపోవటం వీరి సాంఘిక వెనకబాటు తనమే అంటారు సామాజిక శాస్త్రవేత్తలు. 94% లిటరసి రేట్ కలిగి భారత్ లోనే అత్యధిక విద్యాదికులున్న కెరళ లోనే కుల సమాజం వర్దిల్లుతుంటే ప్రజాస్వామ్యం ఈ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిదులు వీరికి చేసే సేవేంటో మనకు అర్ధమౌతుంది. ఈ దురంతాల మూలంగానే ప్రాంత, మత, కుల, లింగ వివక్షలతో దేశప్రజలు, వ్యవస్థలు కుళ్ళిపోతున్నాయి. నేరనిరూపణ 77% గా ఉన్న కేరళలో, దానికి తగిన నిష్పత్తిలో స్త్రీలపై జరిగే అత్యాచారాల నీర విచారణలో ఉండట్లేదని గణాంకాలు చెపుతున్నాయి. దేశమంతా ఇలాంటి అత్యాచారాలు జరిగితే కుటుంబపరువు ప్రతిష్ఠల దృష్ట్యా కోర్టు వెలుపలే సంధికుదుర్చుకొని రాజీ పడుతున్నారు.




జాట్ రిజర్వేషన్ ఉద్యమ సమయములో ఉధృతంగా ఉవ్వెత్తున హింస ప్రబలటమే కాకుండా 10 మందికిపైగా మహిళలను కార్ల నుండి బయటకులాగివేసి అమానుష మారణకాండ వారిపై అల్లరి మూకలు జరిపినట్లు మథాల్ ప్రాంతములో చిరిగి చిపులగా ఉన్న స్రీల వస్త్రాలు, అక్కడ జరిగిన మారణ కాండకు సాక్ష్యమైనా ముగ్గురు మహిళా పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపినా ఎవరూ ముందుకు వచ్చి పిర్యాదులు ఇవ్వక పోవటం ఈ జాతి దురదృష్టం పట్టిన గ్రహణం. సమాజం, కుటుంబం, రౌడీ-గాంగ్ లతో కూడిన వత్తిడే వారిని భాద్యతనుండి దూరం పెట్టాయి. దీనితో నేరస్తులకు పడే శిక్ష యేమిటో ఎలా నేరం నుండి తప్పించుకొని అనేక సార్లు ఈ నేరం చేసినా ఏమీ అవదని సంకేతాలు వెళ్ళుతున్నాయి.




ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీ చిత్రములో చెప్పినట్లు ఆరేపిస్టులు తామెంత కౄరంగా అమెపై అత్యాచారం చేసినా ఎదిరించ కూడదనే సందేశం నిర్భయ ద్వారానేకాదు, జిషా ద్వారా కూడా, డిల్లీ లోనే కాదు, మారుమూల పల్లె లోనైనా ఫలితాలిలాగనే ఉంటాయని పంపించారు" దీన్నిబట్టి ఈ కౄరుల కౄరత్వం ఇంతే బయోత్పాతం సృష్టించటం సహజమనే భావన కలిగించటం సహజాతి సహజం. భౌగోళికంగా ఇలాంటి విషయాల ను సమానత్వం తో డీల్ చేయటం చాలా అవసరం. లేకుంటే భారత ప్రజాస్వామ్యం తగిన మూల్యం చెల్లించక తప్పదు.




 

"కలకంఠి (స్త్రీ) కంట కన్నీరు ఒలకిన (చిందితే) సిరి (లక్ష్మి లేదా వైభవం) ఇంట నుండ ఒల్లదు (ఇష్టపడదు)" అన్నారు మనపూర్వీకులు. ఇంట్లో ఇల్లాలి కంట్లో ఏకారణముతోనైనా కన్నెరు కారితే సిరి సంపదలు, అయురారోగ్యాలు, అష్ఠైశ్వర్యాలు, అదృష్టాలు ఆ యింట్లో ఉండటానికి ఇష్టపడవు. అనిర్ధం. ఒక ఇంట్లోనే దూఃక్కిస్తేనే ఆయింటికి దురదృష్టం పడితే - దేశమంతటా 94 మంది వనితలు మానభగానికి గురైతే ఆదేశం పరిస్థితి ఏమిటి?  చూస్తూనే ఉన్నాం కదా! మన ఇండియాని. అందుకే స్త్రీలు దుఃఖించకుండా చూసుకోవలసిన భాధ్యత భారత పురుష పుంగవులదే. ఏ స్త్రీ ఈ దేశములో దుఃఖించరాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: