ఇటీవల కాలంలో దేవుడు పేరు చెప్పి దోచుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. దేవాలయాల అభివృద్ధి పేరిట అని కారణాలు చెబుతూ రూ. లక్షలు వసులు చేస్తూ చివరకు భక్తులకు పంగనామాలు పెడుతున్నారు కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు. అభివృద్ధికి కేటాయించే నిధులు గోరంత అయితే, దోచేసేది మాత్రం కొండంత అన్నట్లుగా తయారైంది ఆయల కమిటీ మెంబర్ల తీరు. హైదరాబాద్ లోని ఓ బాబా ఆలయంలో కమిటీ సభ్యులు దేవాలయం సొమ్మును అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఓ సినీ నటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

బాబా పేరుతో డబ్బులు వసూలు: సినీనటి


నిజాంపేట బాబా ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయని, కొందరు వ్యక్తులు ఆలయసొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని సినీ నటి, బాబా ట్రస్టు సభ్యురాలు జయలలిత అన్నారు. నిజాంపేట షిర్డిసాయి ఆలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ  బాబా ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు లెక్కలు చూపించడం లేదని, ట్రస్ట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి రూ. 25 లక్షలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.



బొట్ల లతాచౌదరి వన్‌మ్యాన్‌షో నడిపిస్తోందని, అమెరికాలోనూ బాబా గుడిపేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తమకు ఇష్టమైన వారినే ట్రస్టు సభ్యులుగా నియమించుకుని, భక్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఆలయ పూజారి అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భక్తులను ఆలయ ట్రస్టీలుగా నియమించాలని, ఇప్పటి వరకు ఆలయ లెక్కలను భహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ వేడుకలపై దాతలు, ట్రస్టీసభ్యులు, భక్తులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: