దేశానికే అన్నం పెట్టే రైతని తెలుగు రైతుకు మంచి పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా పిలిచేవారు. అలాంటి రైతు పరిస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా తెలుగు రైతు పరిస్థితి ఏంటి.. అని ఒకసారి పరిశీలిస్తే కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు కనిపిస్తాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే రైతు పరిస్థితి దయనీయంగా ఉందట.

కేంద్రం ఇటీవల కనీసవేతనాలు ప్రకటించింది. ఇందులో నాలుగో తరగతి ఉద్యోగి కనీస వేతనం కూడా దాదాపు 16 వేల రూపాయలకు చేరింది. కానీ దేశవ్యాప్తంగా సగటు రైతు ఆదాయం మాత్రం నెలకు కేవలం ఆరున్నవేల రూపాయలు మాత్రమే. అంటే కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి జీతంలో సగం కూడా రైతు సంపాదించలేకపోతున్నాడన్నమాట.


ఇది రైతు జాతీయ సగటు లెక్కల ప్రకారం. తెలుగు రాష్ట్రాల్లో రైతు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు సగటు ఆదాయం నెలకు కేవలం 5 వేల 9 వందల 79 రూపాయలు మాత్రమే. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 13 వేలు దాటింది. ఈ విషయంలో తెలంగాణ రైతు పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. 

తెలంగాణ రైతు ఆదాయం నెలకు 6 వేల 3 వందల 11 రూపాయలు. తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో వరుసగా 14, 15 స్థానాల్లో ఉన్నారట. అప్పుల విషయలోనూ తెలుగు రైతుల పరిస్థితి దారుణంగానే ఉంది. ఏపీరైతు కుటుంబానికి సగటున 1, 23 400 అప్పు ఉంది. తెలంగాణ రైతు కుటుంబానికి 93, 500 రూపాయలు ఉంది. ఇదీ మన తెలుగు రైతు దీన గాథ.



మరింత సమాచారం తెలుసుకోండి: