కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైన విషయం అందరికీ విదితమే. అయితే ప్రభుత్వానికి ఉన్న తొందర పనులని చేపట్టిన కాంట్రాక్టర్ల కు లేకపోవడంతో పుష్కర పనుల్ని పరిశీలించిన చంద్రబాబు ఆ సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు పలు అభివృద్ధి పనుల నిమిత్తం అధికారులతో సమావేశం నిర్వహించిన బాబు పుష్కర పనులను అప్పగించిన కాంట్రాక్టర్ పై ఆగ్రహంతో ఊగిపోయారట.

Related Image


ఏపీలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఓ కాంట్రాక్టర్ ను ఏకంగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. పుష్కర పనులకు సంబంధించి విజయవాడలోని సీతానగరం ఘాట్ పనులను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ సీఎంఓ అధికారుల పిలుపుతో అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టారు. 



అప్పటికే పుష్కర పనులపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు... సదరు కాంట్రాక్టర్ ను చూడగానే ఆగ్రహోదగ్రులయ్యారు. ‘‘ఎంతో నమ్మకంతో పనులు అప్పగిస్తే ఇలా చేస్తావా? చేతకాకపోతే తప్పుకో. వేరే వాళ్లు ఆ పనిని చేపడతారు. ఇలా చేసినందుకు నీపై చర్య తీసుకుంటాను’’ అని చంద్రబాబు హూంకరించడంతో ఆ కాంట్రాక్టర్ వణికిపోయాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: