అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నోటి దూల ట్రంప్ అనూహ్యంగా దూసుకుపోతున్నాడు.. కొంపదీసి అమెరికా అధ్యక్షుడు అయిపోతాడేంటి అని ఆశ్చర్యపోయేలా ముందుకు వెళ్తున్నాడు.. ఇప్పుడు తాజాగా అలాంటి ట్రంప్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 

ఇది ఈనాటి ఘటన కాదట.. దాదాపు 20 ఏళ్ల క్రితం ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని జిల్ హార్త్ అనే ఓ మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు వీధికెక్కింది. న్యూయర్క్ నుంచి వెలువడే గార్డియన్ అనే పత్రికకు ఆమె రీసెంటుగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పట్లో ట్రంప్ ఓ అందాల పోటీని స్పాన్సర్ చేశాడని.. ఆ ప్రాజెక్టు సందర్భంగా ట్రంప్ తనను వేధించాడని గుర్తు చేసుకుంటోంది. 


ఓ విందులో ట్రంప్ తనను టేబుల్ కింద నుంచి తాకే ప్రయత్నం చేశాడని చెబుతోంది. మరోసారి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తనను ఓ గదిలోకి లాక్కెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేశాడని.. లోబరుచుకోవాలని ప్రయత్నించాడని.. కానీ తాను అతడ్ని సమర్థంగానే ఎదుర్కొన్నానని జిల్ చెబుతోంది. అప్పట్లో ట్రంప్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉన్నాడని జిల్ గుర్తు చేసుకుంది. 

ఆ అందాల పోటీకి ట్రంప్ స్పాన్సర్ కాబట్టి తాను ఆయన్ని తరచూ కలవాల్సి వచ్చేదని.. దాన్ని ఆయన అడ్వాంటేజ్ గా తీసుకున్నాడని జిల్ అంటోంది. అయితే ట్రంప్ అధ్యక్షపదవి వైపు దూసుకుపోవడం వల్లే ప్రత్యర్థులు ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్రయోగిస్తున్నారని ట్రంప్ అనుకూలురు వాదిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో..!? 



మరింత సమాచారం తెలుసుకోండి: