తెలుగు మీడియాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానెళ్లు ఇప్పుడు వాటిని నడిపించలేక నానా తంటాలు పడుతున్నారు. ఛానెల్ పెట్టీపెట్టగానే కోట్లు వెనకేసుకోవచ్చు.. ఛానళ్ల పేరు చెప్పి దందాలు చేసుకోవచ్చు.. అడ్డగోలు మార్గాల్లో కోట్లు సంపాదించుకోవచ్చని ఆశపడ్డవారు ఇప్పుడు నిరాశలో మునిగిపోయారు. 

ఇటీవల తెలుగు న్యూస్ ఛానళ్లు ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం అనే జాడ్యం పెరుగుతోంది. మొదట్లో స్టూడియో ఎన్ అనే ఛానల్ ప్రారంభించిన ఈ దుస్సాంప్రదాయాన్ని మహా టీవీ అందిపుచ్చుకుంది. ఇక ఆ  తర్వాత సీవీఆర్ తో పాటు మరికొన్ని ఛానళ్లు దాన్ని కొనసాగిస్తున్నట్టున్నాయి. 


సీవీఆర్ న్యూస్ చానెల్ లో ఒకటి, రెండేళ్లుగా సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. గతంలోనూ సిబ్బందికి, యాజమాన్యానికి గొడవలు జరిగాయి. కొందరిని అన్యాయంగా తొలగించారు కూడా.. తాజా ఈ జీతాలు ఇవ్వక ఐదారు నెలలు గడచిపోయాయని ఉద్యోగులు చెబుతున్నారు. హైదరాబాద్ వంటి నగరంలో ఒక్క నెల జీతం రాకపోతేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 

అలాంటిది ఐదారు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన తీవ్రం చేసారు. రాత్రంతా ధ‌ర్నాకు దిగారు. ఏకంగా హెచ్ఓడీ నే నిర్బంధించారు. ఈమధ్య కొన్ని రోజుల క్రితం ఆందోళన జరిపినప్పుడు ఇచ్చిన చెక్కులు కూడా చెల్లకపోవడంపై యాజమాన్యాన్ని నిలదీశారు. మరి ఈ ఆందోళనకు అంతం ఎప్పుడో.. సీవీఆర్ యాజమాన్యానికి బుద్ది వచ్చేదెన్నడో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: