గౌరవనీయులైన పురపాలక శాఖామాత్యుల వారి దివ్యసముఖానికి,

 

ఉద్యమ సమయంలో  హైదరాబాద్  తెలంగాణాకు శిరస్సు వంటిదని, హైదరాబాద్  లేని తెలంగాణా రాష్ట్రమే అవసరము లేదని మీ తండ్రిగారు మీరందరూ ఉద్యమ స్పూర్తితో అనేకసార్లు ప్రవచించారు. ఈ మహా నగరాన్ని విశ్వనగరం చేస్తామని,  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేశాల రాజధాని నగరాలకు ధీటుగా హైదరాబాద్ ను నిలబెడ తామని అనేక వాగ్ధానాలు చేశారు. మీతో పాటు అనేక మంది మన తెలంగాణా ప్రజల త్యాగఫలం గా తెలంగాణా వచ్చింది. తెలంగాణా సాధన కోసం వేలసంఖ్య లో ప్రజలు అమరజీవులయ్యారు.

 

రెండు సంవత్సరాల వయ సొచ్చింది ఈ తెలంగాణా బిడ్డకు.  కాని దాని శిరస్సైన భాగ్యనగరం అదే నండి మీ హైదరాబాద్ పరిస్థితి దయనీయం గా మారటం కొనసాగుతుందే తప్ప పుట్టినప్పటి నుండి అది క్షీణించటం ఆగటం లేదు. మీ తల్లినైన నన్ను నా రహదార్లను వాడుకుంటున్నారే తప్ప,  నా అరొగ్యమెలా ఉంది, నా దీన స్థితిని అర్ధం చేసుకోకుండా ఇష్టారీతిన  నా జవజీవాలను హరిస్తున్నారు. నన్ను పద్దతిగా నిర్వహించటం మానేశారు. రోజుకు లక్షల్లో వాహనాలు నన్ను వాడేసు కుంటున్నాయి.కొన్ని వాహనాలైతే పదుల టన్నుల భారతో నాపై దూసుకుంటూ  పోతున్నాయి. నా ఉపరితలాన్ని అరగ దీసి పక్కనున్న కొద్ది మోరీల ఎత్తుకు, సైజుకు నన్ను  కుందించివేశాయి. అసలు మురుగు నీరు,  వాన నీరు పారే వ్యవస్థే మన భాగ్యనగరము లో లేదు. చెత్తా, చదారం, మురుగు, కుళ్ళు నాపై అలా ప్రవహిస్తూ నన్ను అనారోగ్యానికి గురిచేస్తు న్నాయి.  ఒకప్పుడిలా చేసే నగరాన్ని  కలరా మహమ్మారి  పీడించి ఉంది. నాటి రాజులు అల్లాని ప్రార్ధించి చార్మినార్ కట్టి ప్రమాదాన్నుంచి నగరాన్ని కాపాడారు.


కులీకుతుబ్షా నన్ను నిర్మించినాడే నాపై ప్రియురాలిని ప్రేమించినంత  ప్రేమతో నన్ను అద్భుతంగా గౌరవ ప్రదంగా నిర్మించారు. అత్యంత సౌందర్యవంతంగా నన్నుంచుతూ  నిర్వహించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి నేను శైశవదశ నుండి కౌమారదశకు చేరి కొన్ని దశాబ్ధాలు గడిచాయి. ప్రియురాలు  పెండ్లా మైంది.  ప్రియురాల్లా నన్ను మీరు చూసిన రోజులు తలచుకుంటూ మురిసిపోతుంటాను తప్ప నాదుస్థితికి వగచిందిలేదిప్పటికి. భరించలేని పరిస్థితుల్లోనే మీకు నా వేదన మొరపెట్టుకుంటున్నాను.



ఇక పెండ్లామైంది మెయింటైన్ చేసినా చేయకపోయినా అలా పడి ఉంటుందని మీరు ఔకుంటున్నారని,  భావిస్తున్నారని అనిపిస్తుంది. మీరు డ్రైనేజులు, భూగర్బ కరెంటు లైనులు, భి.ఎస్.ఎన్.ఎల్ టెలిఫొన్ లైన్ల కోసం, మీతాగు నీటి పైపులైన్ల కోసం నా గర్భాన్ని ఇష్టమొచ్చినట్లు చీల్చుతూ నన్ను నరక యాతనకు గురిచేస్తున్నారు. సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ లోనే కొంచెము నయమని పిస్తుంది నామటుకు నాకు. వారు నా రహదార్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేసైనా  కాస్త తారు రంగు నాపైన పూసి నిగనిగ లాడించేవారు. సౌందర్యంగా  సుందరంగా ఉంచుతున్నట్లు భ్రమింపజేసేవారు.


కాని తెలంగాణా వచ్చాక, మన పాలన మనమే చేసుకునేటప్పుడు నావైభోగం అద్భుతంగా ఉంటుందనుకున్నాను. ఇప్పుడది కలగా మిగిలి, నా బ్రతుకు దుర్భరంగా మారింది. నా తెలంగాణాకు రారాణినైన నన్ను నా నుంచివచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ నా ఆరోగ్యం అదే రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలని మెరుగు పరచకుండా నన్ను నానా హింసకు గురిచేస్తున్నారు.  


ఒక పెద్దాయనైతే ఈ నగరాన్ని అదే నన్ను చూపి నేనే నిర్మించానని ప్రపంచమంతా తిరిగి అప్పులు తెచ్చుకుంటున్నాదు. కొత్త విశ్వనగరం మన ప్రక్క రాష్ట్రములో ఇంద్రపురి పేరుతో కట్టేస్తున్నాడు. ఆయన కొత్త నగరాన్ని  వేరే దేశాలవాళ్ళకు ఒప్పగించి వారిపద్దతుల్లో దాన్ని  వారిచేతే నిర్మింపచేస్తున్నాడు. అక్కడ నా సోదరి బిడ్డలు అనాధలై, మాతో ప్రెమ అనుభందాలను, సర్వసంబందములను  కోల్పోతున్నారు.  నా సోదరిని అభివృద్దిపేరుతో   వేరే దేశాల్లోళ్ళకి తాకట్టు పెడుతున్నారు. నా సోదరిని పరులపంచకు చేర్చటానికి తెగ ఉబలాటపడుతున్నాడు పక్క స్టేట్ ముఖ్యమంత్రి అదీ ఏకపక్షంగా.


నాపై ఆ నిజాం నవాబ్ సాబ్ కట్టిన భవనాలను కూల్చి కొత్త భవనాలు నిర్మించాలనే మీ కుటుంబ తాపత్రయం ఉబలాటం శ్రేయస్కరం కాదు. నా నిర్మాణం పర్షియన్, అరబిక్, గ్రీస్ దేశాల నగర నిర్మాణ పద్దతు లను సంస్కృతులను ప్రోదిచేసు కొని, అర్ధం చేసుకొని అర్ధవంతంగా నా రాజు నా బిడ్డల చేతే నన్ను నిర్మించి ఒక నాడు ప్రపంచము లోనే ఐశ్వర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాడు. నేను, నా రాజు ఒక నాడు దేదీప్యమానంగా హిమాలయాలంత ఎత్తులో తలెత్తుకొని విశ్వం ముందు ధీరత్వం ప్రదర్శించాము నిలిచాము.


ఈ రోజు కొందరు తుచ్చులు వాస్తు, తొక్క, తోలు అంటూ నన్ను అనేక శస్త్ర చికిత్సలకు గురిచేస్తున్నారు. నాటి నిర్మాణాలే నన్ను నా రాజును విశ్వవ్యాపితం చేయగా లేని వాస్తు , ఇప్పుడెలా ముందుకొచ్చింది. నా ఈ రోధన ఎప్పుడో మిమ్మల్ని కట్టికుడుపుతుంది. నగరాన్ని, అదే ఈ నా దుస్థిని ఆకళిపు చేసుకొనక " రోం దహించుకు పోతిన్నప్పుడు  ఫిడేలు వాయించు కుంటూ కూర్చున్న వాడొకడు కాల గర్భములో కలిసిపోయాడు"  నేను ఇప్పుడు క్రమంగా క్షీణించుకు పోతు న్నప్పుడు,  మీరు అదిచేస్తా, ఇది చేస్తా , అలా చేస్తా, ఇలాచేస్తా అనటం మానేసి  చరిత్ర తెలుసుకోని  సత్వరం స్పందించి నన్ను కరుణించండి.  


నా ఉనికి నా అభివృద్ది మీకు వైభోగం సిద్ధింపజేస్తుంది.  నేను డటం నేనుండటం మీకిష్టమైతే వాస్తులాంటి విషయాలను వదిలేసి  నన్ను నాలా నిర్వహిస్తే చాలు. మీరు చిరకాలం సుభిక్షంగా వర్దిల్లుతారు. చక్కగా మురుగు నీటి పారుదల, తాగునీటి సరపరా, విద్యుత్ & సమాచార లైనులు ఇతరత్రావన్నీ అన్నీ శాఖల సమన్వయముతో ఒక్కసారే నిర్మించి వాటిని నిర్వహించే కేంద్రీకృత వ్యవస్థని తయారుచేస్తే నాకీ ఘోష తప్పుతుంది. నా అశీస్సులు సర్వదా మీకుంటాయి. లెకుంటే అసలే తాగుబోతుల చేతుల్లో వాహనాల స్టీరింగులుండే ఈ నగరం రోడ్లు బాగలేకపోతే ఇంకా దరిద్రమౌతుంది. శతాబ్ధాల చరిత్ర ఉన్న నగరాలకు వాస్తు వర్తించదని తెలుసుకో!


రాత్రుళ్ళు తాగుబోతులు, జూదరులు, అత్యాచారం చేసేటోల్లు, వ్యభిచారులు, వ్యభిచారిణులు, దొంగలు, దోపిడీదార్లు, అరాచకీయవాదులు, మత్తుమందు అమ్మేటొల్లు, నల్లబజారు వ్యాపారం చేసేటోల్లు, మాదక ద్రవ్యాలు అమ్మేటోల్లు, తప్పుదారి పట్టిన కళాకార్లు, సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళను నియంత్రించే వ్యవస్థలున్నట్లే నన్ను, నా రహదార్లను నిర్వహించే వ్యవస్థ ను సిద్దం చేస్తే సరి. ప్రతి పౌరునివద్ద ఈ నియంత్రణాధికారిని సంప్రదించే ఫోను నంబర్ ఉండేలా చూడండి. ఇగప్పుడు ప్రజలే నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు సమస్యేముంది ప్రజల సమస్యలకు వారినే పిర్యాదీ దారులను చేసి ప్రజా వేగు వ్యవస్థని నిర్మిస్తే, వారికే  భాధ్యత ఇస్తే నా నిర్వహణ వారే చూసుకునే ప్రణాళిక నిర్మిస్తే చాలు.



దయచేసి సుత్తి ఎక్కువ కృషి తక్కువ పనులు మాని, నన్ను అభివృద్ది చేయకపోతే - ఎన్నికలలో నా పై మాన్-హోల్స్ పడి మరణించిన వాళ్ళు, రోడ్ పై గుంటల్లో పడి ప్రమాదాలకు గురై ప్రమాదాలకు గురైన వాళ్ళు, కుళ్ళు, కంపు, చెట్ట, చదారాలతో నిండిన నా నుండి నేను నశిస్తూ వెలువరించే  కాలుష్యం కోరల్లో చిక్కుకొని మరణించిన వాళ్ళు, అనారోగ్యంతో మరణించే వాళ్ళ ఆత్మ ఘోష రానున్న ఎన్నికల్లో మార్మోగి ఫలితాలు మారకుండా చూసుకోకుంటే మీకు శ్రేయస్సు-ప్రజలకు శుభోదయం కలగదు. నాకు శుభం కలగదు.


మీ నుంచి నగరాభివృద్ది (హైదరాబాద్),  ప్రజాశ్రేయస్సు ఆశిస్తూ,

సర్వదా మీ శ్రేయస్సు కోరుకొనే,

మాతృదేవత,  అదృష్టదీపిక

Sd/-

హైదరాబాద్ నగరం & రహదార్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: