ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ తెలుగు దేశం, కేంద్రం లో అధికార పార్టీ బీజేపీ మధ్యన 2014 ఎలెక్షన్ లో పొత్తు ఉందేమో గానీ 2019 లో పొత్తు ఉంటుందా అంటే గ్యారెంటీ ఇవ్వగలిగినవాళ్ళు ఎవ్వరూ లేరు. భారతీయ జనతా పార్టీ కీ తెలుగు దేశానికీ మధ్యన దూరం అమాంతం పెరుగుతూ వస్తోంది. రాష్ట్రానికి సహాయం చేసే విషయం లో కేంద్రానిది మొదటి నుంచీ మొండి చేయి. తెలుగు రాష్ట్రాల విభజన తరవాత కేంద్రం స్వయంగా మిమ్మల్ని ఆదుకుంటుంది, మీ గోడు వింటుంది, మీకేం కావాలి అంటే అది ఇస్తుంది అంటూ మోడీ స్వయంగా రాష్ట్రంలో పర్యటించి మరీ మాట ఇచ్చారు.

 

 కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా ఆ మాట మీద నిలబడినట్టు కనపడలేదు ఆయన. ఈ వ్యవహారం లో సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి చంద్రబాబు ది . ఆయన ఎక్కడైనా పల్లెత్తు మాట అంటే ఒచ్చే ఫండ్స్ కూడా రావు అని ఆయన ఆలోచన. సో నోరు మెదపలేక మొన్న మొన్నటి వరకూ సైలెంట్ గానే ఉన్నారు బాబు పాపం. కానీ ఇప్పుడు కేంద్రం చూపుతున్న ఉదాసీనత విషయం లో విసుగుపుట్టిన బాబు నెమ్మదిగా ప్రధాని మీదా, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీదా గళం విప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ మోడీ మీద విమర్శలు చెయ్యడం లో టీడీపీ కాస్త ఆలోచించింది. ఇప్పుడిప్పుడే పార్టీ శ్రేణుల ద్వారా ఇన్ డైరెక్ట్ గా మోడీ మీద రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు బాబు.

 

ఇక స్వయంగా మోడీ కి వ్యతిరేకంగా గళం విప్పబోతున్నట్టు కనిపిస్తున్నారు ఆయన. మోడీ నేతృత్వం లో ఉన్న కేంద్ర సర్కారు ఆశించిన స్థాయి లో సహకారం అందించడం లేదు అని స్వయంగా అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన తరవాత రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో తమకి తీవ్ర అన్యాయం జరిగింది అని ఓపెన్ అయిపోయారు. ఏపీ కి కేంద్రం ఎలాంటి విధమైన అన్యాయాలు చేస్తోందో బాబు స్వయంగా లెక్కలతో సహా వివరించడం షాకింగ్ గా మారింది. రాష్ట్ర బడ్జెట్ 16000 కోట్లు లోటు లో ఉండగా దాన్ని కేంద్రం భర్తీ చెయ్యాల్సిన అవసరం ఉంది. అయితే వారు కేవలం 4800 కోట్లు ఇచ్చారు అని బాబు చెప్పారు.

 

 " సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ల ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ విషయం లో తమ హామీ నిలబెట్టుకున్న పాపాన పోలేదు. పోలవరం ప్రాజెక్ట్ కి కేవలం 800 కోట్లు విదిలించారు. అవి ఏ మూలకూ సరిపోవు , విశాఖ రైల్వే జోన్ సంగతి సరే సరి, దాని మీద నిర్ణయం ఎప్పటికి తీసుకుంటారో కూడా తెలీదు. వెనకబడిన ప్రాంతాలకి నిధులు ఇవ్వడమే లేదు. రాజధాని నిర్మాణం విషయం లో ఇక దిక్కు లేదు " అని చంద్రబాబు నేరుగా మోడీ మీద  ఆవేదన వ్యక్తం చెయ్యడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: