కరీబియన్‌ దీవుల్లో భారత ఘనమైన బోణీ కొట్టింది. ఆతిథ్య వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్‌ చేసి, ఆ జట్టును ఫాలోఆన్‌లోకి నెట్టిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. బంతితోనూ విజృంభించాడు. అతను 25 ఓవర్లలో 87 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విలవిలలాడిన విండీస్‌.. 78 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది.



మార్లోన్‌ శామ్యూల్స్‌ (50) రాణించాడు. 132కే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో కార్లోస్‌ బ్రాతవైట్‌ (51 నాటౌట్‌), దేవేంద్ర బిషూ (45) రాణించినా విండీస్‌ను ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించలేకపోయారు. లోయరార్డర్లో డౌరిచ్‌ (57), హోల్డర్‌ (36) పోరాడటంతో విండీస్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కోహ్లి వెంటనే విండీస్‌ను ఫాలోఆన్‌ ఆడించాడు. ఆట ఆఖరుకు ఆతిథ్య జట్టు 21/1తో నిలిచింది. ఇషాంత్‌.. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (2)ను ఔట్‌ చేసి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ పతనానికి తెరతీశాడు. నాలుగో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌.. ఆరంభంలో పర్వాలేదనిపించింది. ఓపెనర్‌ చంద్రిక (31), శామ్యూల్స్‌ నిలకడగా ఆడటంతో ఓ దశలో 88/2తో నిలిచింది. ఐతే ఇక్కడే అశ్విన్‌ మాయాజాలం మొదలైంది. అతను చంద్రికను ఔట్‌ చేసి పతనానికి తెరతీశాడు.


ashwin

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మొత్తం 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్‌. 
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 90.2 ఓవర్లలో 243 ఆలౌట్‌. 
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌): క్రెయిగ్‌ బ్రాతవైట్‌ (ఎల్బీ) ఇషాంత 2, చంద్రిక (సి) సాహా (బి) అశ్విన్‌ 31, బ్రావో (సి) రహానె (బి) ఉమేష్‌ 10, శామ్యూల్స్‌ (బి) అశ్విన్‌ 50, బ్లాక్‌వుడ్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 0, ఛేజ్‌ (సి) సబ్‌ (రాహుల్‌) (బి) అశ్విన్‌ 8, డౌరిచ్‌ (ఎల్బీ) మిశ్రా 9, హోల్డర్‌ (బి) అశ్విన్‌ 16, కార్లోస్‌ బ్రాతవైట్‌ 51 నాటౌట్‌, బిషూ 32(సి) పుజారా (బి) అశ్విన్‌ 45, గాబ్రియెల్‌ (బి) అశ్విన్‌ 4
ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 231; వికెట్లపతనం: 1-2, 2-21, 3-88, 4-92, 5-101, 6-106, 7-120, 8-132, 9-227; బౌలింగ్‌: ఇషాంత్ 11-2-27-1, షమి 10-3-26-0, ఉమేష్‌ 13-4-34-1, అశ్విన్‌ 25-8-83-7, మిశ్రా 19-3-61-1.


మరింత సమాచారం తెలుసుకోండి: