దేశవ్యాప్తంగా మొత్తం 25 పర్యాటక ప్రాజెక్టుల కోసం కేంద్ర పర్యాటకశాఖ రూ.2,047.77 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడత కింద రూ.402.82 కోట్లు విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు నాలుగు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. పర్యాటక రంగానికి తగిన ప్రోత్సాహం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వదేశ్‌ దర్శన్‌ పథకంలో 21 రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. రూ.2048 కోట్ల వ్యయంతో చర్యలు చేపడతారు. ఇందులో తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో మూడు ప్రాజెక్టులకు 282 కోట్లు మంజూరు చేశారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చనున్నారు.



ఏపీకి రూ.130.21 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరుచేసి తొలి విడత కింద రూ.26.04 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు రూ.176.02 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరుచేసి రూ.35.2 కోట్లను విడుదల చేసింది. ఏపీలో కాకినాడ-హోప్‌ఐలాండ్‌-కోనసీమను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 13 థీమ్‌ సర్క్యూట్లను ఎంపిక చేసింది. తెలంగాణలో రూ.176 కోట్లతో రెండు సర్క్యూట్లను కేంద్రం చేపట్టింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎకో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు. 



రూ.91.62 కోట్ల అంచనా వ్యయంతో ఈ సర్క్యూట్‌లో వివిధ పనులు చేపట్టి ఇప్పటి వరకు రూ.18.32 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన సర్క్యూట్‌లో భాగంగా ములుగు- లక్నవరం- తడవి- దమరవి- ముల్లూరు -బొగత జలపాతాలను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు. వీటి కోసం రూ.84.40 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.16.88 కోట్లు మంజూరు చేశారు. ఇక, ఏపీ రెండు ప్రాజెక్టులను దక్కించుకొంది. రూ. 130 కోట్ల విలువైన ఈ కోస్తా సర్క్యూట్‌ల్లో కాకినాడ-హోప్‌ ఐలాండ్‌- కోనసీమ; పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోస్తా ప్రాంతాలను ప్రపంచ స్థాయి కోస్తాతీర, ఏకో టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: