శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని టీజేఏసీ చైర్మన్  ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మనది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఇక్కడ దౌర్జన్య పాలనను సహించం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేయడమే కాకుండా రైతులపై లాఠీచార్జి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై ఉద్యమిస్తున్న వారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు.

Image result for kodandaram


నిన్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. జనం కూడా పోలీసులకైకి రాళ్లు రువ్వారు. వెరసి రాజీవ్ రహదారి రణరంగాన్నే తలపించింది. తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు వెళుతున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. 



తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య భవిష్యత్తును కోరుకుంటే ప్రభుత్వం లాఠీలతో దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులతో చర్చించి, వారిని ఒప్పించాకే ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని జేఏసీ ఒక ప్రకటనలో ఖండించింది. బాధితులను పరామర్శించేందుకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నాయకత్వంలో టీజేఏసీ ప్రతినిధుల బృందం సోమవారం గ్రామాల్లో పర్యటిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో 



ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరిన కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోదండరాంను అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసులను జేఏసీ నేతలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు జేఏసీ నేతలను అదుపు చేయగలిగిన పోలీసులు కోదండరాంను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: