ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భ‌గ‌వంత్ మాన్‌పై స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ స‌స్పెన్ష‌న్ విధించారు. పార్లమెంటులోకి ప్రవేశించే క్రమంలో వివిధ అంచెల భద్రతను ఎలా దాటుకుంటూ వెళ్లాలో చెబుతూ 'మీరు గతంలో ఎన్నడూ చూడనిది ఇవాళ చూడబోతున్నారు' అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ ఇచ్చిన లైవ్ స్ట్రీమింగ్ విషయం క్షమించేంత చిన్నది కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. 



పార్లమెంట్‌ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎంపీ మాన్‌పై స‌స్పెన్ష‌న్ విధిస్తున్న‌ట్లు స్పీక‌ర్ తెలిపారు. ఆ వ్య‌వ‌హారాన్ని విచారించేందుకు 9 మంది స‌భ్యుల నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ తెలిపారు. ఇవాళ లోక‌స‌భ‌లో ఆమె మాట్లాడుతూ ఆగ‌స్టు 3వ తేదీలోపు నిపుణుల క‌మిటీ ఎంపీ మాన్ వీడియో వ్య‌వ‌హారంపై నివేదిక‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.

'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు'


ఆగస్టు 3లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించిన స్పీకర్, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు చేపడతామని అన్నారు. పార్లమెంట్‌ భద్రతను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఆప్‌ ఎంపీ భగవంత్ మాన్ సింగ్‌పై లోక్‌సభ స్పీకర్‌ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తాను చేసిన పనిపై భగవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ కీర్తి సోమయ్య నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: