హైకోర్టు విభజనకు తెలంగాణ న్యాయవాదులు కదం తొక్కారు. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలంటూ రాజధానిలోని జంతర్‌మంతర్‌లో భారీ ధర్నా చేశారు. 10 జిల్లాల నుంచి వందలాది న్యాయవాదులు ధర్నాకు తరలివచ్చారు. న్యాయమూర్తులు, న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హైకోర్టుతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. ఏ రాష్ట్ర జడ్జిలు.. ఆ రాష్ట్రంలోనే ఉండాలని తేల్చి చెప్పారు. న్యాయాన్ని కూడా దోచుకుంటున్నారని, ‘ఆంధ్ర న్యాయమూర్తుల్లారా.. తెలంగాణను వదిలి ఆంధ్రకు వెళ్లిపోవాలి..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

lawyers1


కేంద్రం తీరుకు నిరసనగా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రాష్ట్రంలోని అన్ని బార్ అసొసియేషన్ల సభ్యులు కలిపి సుమారు రెండు వేల మందికిపైగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగా మరో పోరాటం చేసి ప్రత్యేక హైకోర్టును సాధించుకుంటామని వారంతా నినదించారు.

lawyers2


లంగాణ ఆటపాటలు, ధూంధాంలతో తెలంగాణకు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని, ఆంధ్ర పెత్తనాన్ని పాటల రూపంలో వినిపించారు. చివరకు హైకోర్టును వెంటనే విభజించాలని, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రూపొందించిన ప్రొవిజినల్ లిస్టును ఉపసంహరించుకోవాలని, జడ్జీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఈ మహాధర్నాలో తీర్మానాలు ఆమోదించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల ప్రధానితోనూ సీఎం కేసీఆర్ దీని గురించి చర్చించారని, త్వరలోనే పరిష్కారం రాకపోతే రాష్ర్టాన్ని సాధించుకున్నట్టుగానే హైకోర్టునూ సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.
lawyers3


తెలంగాణకు సొంతంగా హైకోర్టు ఉండాలని ఎంపీలు డిమాండ్ చేయడం చాలా న్యాయమైన కోరిక అనే అంశం యావత్తు దేశానికి ఈ నిరసనల ద్వారా స్పష్టమైందని అన్నారు. సీఎం కేసీఆర్ సైతం సింగిల్ పాయింట్ ఎజెండాగా హైకోర్టు విభజన అంశం కోసమే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారని, సానుకూలంగా స్పందించి సత్వరం నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని కవిత చెప్పారు. ఊపిరున్నంతవరకు ఉద్యమం చేయడం తెలంగాణ స్వభావం.. హైకోర్టును సాధించుకునేంత వరకూ ఉద్యమిద్దాం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: