ఈ మద్య కాలంలో ప్రమాదాలు ఎలా ముంచుకు వస్తాయో ఎవ్వరికీ తెలియకుండా పోతుంది.  వాస్తవానికి ప్రమాదాలు చెప్పిరావు కానీ వాటిని మనం ముందే పసిగడితే కొంత తప్పించుకునే అవకాశం ఉంటుంది.  ఈ మద్య కొన్ని సంపన్న దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది..దీంతో కొంత మంది ఉన్మాదులు గన్స్ తో విచ్చలవిడిగా రెచ్చిపోతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా జపాన్ లో ఓ యువకుడు అన్యాయంగా వికాలంగులను పొట్టన బెట్టుకున్నాడు. మొన్నామద్య అమెరికాలో కొంత మంది స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటున్న సమయంలో ఓ అగంతకుడు వచ్చి వారిపై కాల్పులు జరిపారు..ఇందులో ఇద్దరు చనిపోయారు. ఇలా కొంత మంది ఉన్మాదులు రెచ్చిపోయి ప్రాణాలు తీస్తుంటారు. ఇక కొంత మంది తమకు తాముగా కొన్ని తెలివితక్కువ పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చకుంటారు.

ఆ మద్య ఢిల్లీలో జూ పార్క్ కి వెళ్లి ప్రమాద వశాత్తు పులి ఉన్న ప్రదేశంలో పడటంతో ఆ పులి అతనిపై ఎటాక్ చేసి చంపేసింది. ఇలా కొంత మంది కృరమృగాల వద్దకు వెళ్లి అనుకోని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. తాజాగా  చైనా రాజధాని బీజింగ్ ఒక మహిళను పులి అందరూ చూస్తుండగానే ఎటాక్ చేసి తీసుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. చైనా రాజధాని బీజింగ్ సమీపంలోని బడాలింగ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ లో ఈ ఘటన జరిగినట్టు చైనా న్యూస్ డాట్ కామ్ వెల్లడించింది. ఆ పార్క్ చూడటానికి ఇద్దరు భార్య భర్తలు వెళ్లారు..మార్గ మద్యలో ఇద్దరికీ చిన్న గడవ కావడంతో ఆమె హటాత్తుగా కారు ఆపి కారు లోంచి దిగి భర్తతో తగువులాడుతుండగా హఠాత్తుగా వెనుకనుంచి వచ్చిన పెద్దపులి ఆమెను లాక్కెళ్లి చంపేసింది. బీజింగ్ సమీపంలోని కారులో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉండగా, వారు కారు దిగి సాయం చేసేందుకు ప్రయత్నించేలోగా మరో పులి కూడా దాడి చేసి ఆమెను చంపేసినట్టు తెలుస్తోంది.

కారులో ఉన్న మరో యువతికి గాయాలయ్యాయి.  అయితే అక్కడ రూల్ ప్రకారం పులలు స్వేచ్చగా తిరిగే ప్రదేశం కనుక విజిటర్స్ తప్పకుండా కారులోనే ఉండి చూడాలి ఒకవేళ ఎవరైనా కారు నుంచి బయటకు వస్తే ప్రమాదానికి బాధ్యులవుతారు అని హెచ్చరిక రాసి ఉంటుంది. కానీ ఆ మహిళ కోపంతో కారు లోంచి దిగడమే ప్రమాదాని కారణం..అయితే పార్కులోని భద్రతాదళాలు క్షణాల్లో స్పందించి పులిని వెంటాడినప్పటికీ యువతి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పార్కును తాత్కాలికంగా మూసివేస్తున్నామని అధికారులు ప్రకటించారు. మొత్తానికి ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: