ఆకురాతి పల్లవి.. అచ్చ తెలుగు అమ్మాయి.. కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్ గా చరిత్ర సృష్టిస్తోంది. 2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్... 6 సంవత్సరాల సర్వీస్. 9 ట్రాన్స్ఫర్లు... అవును పల్లవి ఎక్కడా రాజీపడకుండా బతికింది. అలానే ఉద్యోగం చేసింది. చేస్తోంది.
.
ఈ 33 ఏళ్ల యువతి అంటే కర్ణాటకలోని నాయకులకు మంట. భయం.. ఆమె ఎక్కడకు వస్తే అక్కడ అవినీతిపరులు హడలెత్తాల్సిందే.. ఆవిడ ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎగ్జామ్ మాఫియాను వణికించింది. పేపర్ లీకేజ్ ముఠాల వందల కోట్ల టర్నోవర్  వ్యాపారాన్ని మూయించింది. చంపేస్తామని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. 


ఎండోమెంట్ కమీషనర్‌గా పల్లవి విజయాలు కూడా చాలా ఫేమస్.. తను దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ ఆస్తులను కాపాడారు. సకలేశ్ పూర్ లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఓ ముస్లిం మహిళ పొలానికి వెళ్లే దారిని ఒకడు ఆక్రమించుకుంటే ఆమె విడిపించారు. . ఆ తరువాత పల్లవి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతుంటే..ఆ మహిళ వచ్చి పల్లవి చేతులు పట్టుకుని ఏడ్చేసిందట.

తెలుగు మీడియంలో ఐఎఎస్ పాస్ అయిన మొదటి మహిళ ఆకురాతి పల్లవే. గుంటూరు జిల్లాకు చెందిన పల్లవి సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించింది. మూడోసారి ర్యాంక్ కొట్టింది. చిన్నప్పటి నుంచీ తెలుగు మీడియంలోనే చదివడం వల్ల ఐఎఎస్ ప్రిపరేషన్‌కి పల్లవికి 8 సంవత్సరాలు పట్టింది.
 
అంతే కాదు పల్లవి  ఒక కూచిపూడి డాన్సర్. తెలుగు కవయిత్రి.. శ్లోకాలు రాగయుక్తంగా పాడతారు.. పెయింటింగ్ తన హాబీ. ఎంబ్రాయిడరీలో దిట్ట. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తోంది. పేద అమ్మాయిలకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి కోచింగ్ ఇస్తోంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: