తెలంగాణపై, తెలంగాణ సమస్యలపై కేసీఆర్ కు ఉన్నంత అవగాహన వేరొకరికి లేదు.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకు కేసీఆర్ ఏళ్ల తరబడి సాగించిన అధ్యయనమే కారణం. కానీ ఇటీవల ఓ మహిళానాయకురాలు కేసీఆర్ కే సుద్దులు చెప్పబోయి షాక్ తిన్నదట.  

ఫలానా ప్రాజెక్టును ఇలా కాదు అలా కట్టాలంటూ కొద్ది కాలం క్రితం ఓ మహిళా నాయకురాలు కేసీఆర్‌ వద్దకు వెళ్లిందట. తనకు తెలిసిన సమాచారం చెప్పి..ప్రాజెక్టు రూపు రేఖలు మార్చాల్సిన అవసరంపై చిన్నపాటి ఉపన్యాసం దంచికొట్టిందట. సదరు లేడీ లీడర్ చెప్పిందంతా కేసీఆర్ పూర్తిగా విన్నారట. 


ఆ తరవాత.. కేసీఆర్‌ తన వద్ద ఉన్న ప్రణాళికను తీసి వివరించారట.  ఆ ప్రాజెక్టు కింద ఊరు పేర్లు, చెరువుల పేర్లు, అవి ఎంత ఎత్తులో ఉన్నవి, ఎక్కడెక్కడికి ఎంత దూరం అన్నీ ఏకరువు పెట్టారట. ఆ ప్రాజెక్టుకు అవసర మయ్యే ప్రభుత్వ భూములెన్ని.. ప్రైవేటు భూములెన్ని.. వాటిని ఎలా సేకరించబోతున్నారు.. అన్నీ ఆ లీడర్ కు వివరించారట. 

కేసీఆర్‌ దంచిన ఉపన్యాసంతో ఆ లేడీ లీడర్ నోరు వెళ్లబెట్టిందట.. ఇంకేమీ మాట్లాడలేక ఓ దండం పెట్టి బయటపడిందట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో ఆమే స్వయంగా చెప్పిందట. దటీజ్ కేసీఆర్ అంటున్నారు గులాబీ నేతలు. మొన్నటికి మొన్న అసెంబ్లీలోనే విపక్షాలకు ప్రాజెక్టుల సినిమా చూపించిన కేసీఆర్ కే జట్కా ఇవ్వాలంటే ఎలా చెప్పండి అంటూ చురకలు వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: