రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రసంగించాల్సిన సమయంలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వైఎస్ చౌదరీ... మీరు కేంద్ర మంత్రి. ఈ అంశంపై చర్చలో పాల్గొంటున్నారు. మీకు సమయాన్ని నిర్దేశించలేను. సంక్షిప్తంగా ప్రసంగించండి" అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై తన గళాన్ని గట్టిగా వినిపించలేక, తాను మంత్రిగా కొనసాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించలేక ఆయన ఇబ్బందికి గురయ్యారు. ప్రభుత్వం తరపునా మాట్లాడుతున్నారా, పార్టీ తరపున మాట్లాడుతున్నారా అని విపక్ష సభ్యులు ఆయనను ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే తన ప్రసంగం కొనసాగించారు.

ఇరుకునపడ్డ సుజనా చౌదరి


కనీస ప్రజాస్వామ్య నిబంధనలు పాటించకుండా విభజన జరిగిపోయిందని అన్నారు. విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో బలంగా ఉందని, అది తొలగాలంటే, హోదా ఇవ్వడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ విషయమై ఎన్నో మార్లు ప్రధానితో తమ అధినేత చర్చించారని అన్నారు. విభజన రోజు తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని వివరించారు. ఏపీని విభజించేందుకు తొందరపడ్డ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉత్తరప్రదేశ్ ను విడగొట్టేందుకు వెనుకాడుతున్నాయని, అదంతా పొలిటికల్ గేమ్ అని సుజనా చౌదరి ఆరోపించారు.



ఈ సమయంలో డిప్యూటీ ఛైర్మన్ సమయాభావం గురించి హెచ్చరించారు. దీనికి సుజనా సమాధానం ఇస్తూ... తనకు టైం కావాలని, కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న తమ ప్రభుత్వం బ్లేమ్ కాకూడదని, అందుకు తనకు సమాధానం ఇవ్వాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి వివిధ విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం, ఇతర విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. రైల్వే జోన్, ప్రత్యేకహోదా తక్షణం ప్రకటించాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: