ఆయనో సామాజిక ఉద్యమ కారుడు.. సఫాయి కార్మికుల సమస్యలపై పోరాడిన వాడు.. నిరంతర పోరాటంతో రామన్ మెగసేసే అవార్డు అందుకున్నాడు.. ఆయనే బెజవాడ విల్సన్.. ఈ ఏడాది రామన్ మెగసేసే అవార్డు గెలుచుకున్న ఇద్దరిలో ఈయన ఒకరు. 

ఈ పేరు వినగానే ముందు ఈయన మన తెలుగోడేనేమో అన్న అనుమానం కలిగింది. కానీ ఆ విషయం మీడియాలో ఎక్కడా రాలేదు. అవార్డు విజేత విజయగాధలను ప్రచురించిన ఇంగ్లీషు పత్రికలు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ ఆయన ఇంటిపేరు చూడగానే కచ్చితంగా తెలుగోడే అయి ఉండాలని అనిపించింది.


తీరా కాస్త అతని పుట్టు పూర్వోత్తరాలు వెలికి తీస్తే.. మన ఊహ నిజమేనని తేలింది. అవును బెజవాడ విల్సన్ మనవాడే.. ఏదో అతని పూర్వీకులు ఇక్కడి వారేమో అనుకునేరు.. స్వయంగా బెజవాడ విల్సన్ పుట్టింది కూడా మన తెలుగు గడ్డపైనే. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా పామూరు మండలం కంబాలదిన్న అనే గ్రామమట. 

అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో 1966లో పుట్టాడట విల్సన్. అతని ప్రాధమిక విద్యాభ్యాసం కూడా కంబాలదిన్నెలోనే పూర్తయిందట. ఆ తర్వాత అతని కుటుంబం 
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో స్థిరపడింది. ఆయన చదువుకున్నది కూడా ఏపీ హాస్టళ్లలోనే. అంతే కాదు.. అతని డిగ్రీ కూడా హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుంచే తీసుకున్నాడట. 



మరింత సమాచారం తెలుసుకోండి: