విజిలెన్స్, సీఐడీ, సీబీఐ ఇలాంటి పేర్లు వింటేనే అక్రమాలు చేసేవారి గుండెలు గుబగుబలాడతాయి. ఏసీబీ వాళ్లు వస్తున్నారంటేనే వీళ్ల కాళ్లలో వణుకు మొదలవుతుంది. ఎంతో కష్టపడి అవినీతి చేసి సంపాదించుకున్న సొమ్ములు ఎక్కడ దొరికిపోతాయో అని భయపడతారు.

సరిగ్గా ఇలాంటి అవినీతి అధికారుల బలహీనతలను కొందరు భలేగా సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స్  అధికారులమంటూ దర్జా ఒలకబోస్తూ చెకింగులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నానా హడావిడి చేసి చివరకు వారి నుంచి ఎంతో కొంత వసూలు చేసుకుని చక్కా పోతున్నారు.


ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 వరకూ ప్రైవేటు స్కూళ్లలో ఈ నకిలీ ముఠా తనిఖీలు చేసి సొమ్ము వసూలు చేసుకుపోయిందట. స్కూల్ విజిలెన్స్ కమిటీ  పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్న ఈ ముఠాను చివరకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.  వీరి కదలికలపై నిఘా పెట్టి పథకం ప్రకారం అరెస్టు చేశారు.

వీరు ఈ పది పదిహేను రోజుల్లో 60 వరకూ  ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి  పది లక్షలకుపైగా వసూలు చేసుకెళ్లారట. ఈ నకిలీ ముఠా ఆగడాలు ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం కాలేదు. పక్కాగా విచారణ చేస్తే కానీ ఇంకా ఎందరు దొంగలున్నాయో బయటకు రాదు..



మరింత సమాచారం తెలుసుకోండి: