ప్రపంచంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. మగవారితో సమానంగా అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్న సమయంలో ఎక్కడ చూసి అత్యాచారాలు, హత్యలకు గురి అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న వనెస్సా మార్కోటీ గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో అకౌంట్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వనెస్సా మార్కోటీ (27) అనే యువతిని రేప్ చేసి హత్య చేశారు. వనెస్సా మార్కోటీ మృతదేహాన్ని గుర్తు పట్టకుండా తగలబెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారం ఆమె తల్లి దగ్గరకు వెళ్లినట్లు ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో వనెస్సా కనపడకుండా పోయింది.

కుమార్తె కోసం సాయంత్రం వరకు వేచి చూసిన ఆమె చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు, జాగిలాలను తీసుకొని వెళ్లి ఆ రోడ్డుపక్కనున్న పొదల్లో గాలించారు. సగానికిపైగా కాలిపోయిన మృతదేహం వారికి దొరికింది. ఒంటిపై దుస్తులు లేని ఆమె చేతులపై, కాళ్లపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

వనెస్సా మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగిందని నిర్దారించారు. అయితే ఎంత మంది రేప్ చేశారు అని తెలియడం లేదని, చుట్టు పక్కల ఉన్న గ్రామస్తులను విచారించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: