ప్రపంచ దేశాలన్నిటికి పెద్దన్నగా పిలువబడే దేశం అమెరికా.   అలాంటి అమెరికా అధ్యక్షుడు కూతురు పబ్లిక్ గా చేసిన పని చూస్తే ఔరా అనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్దకూతురు మాలియా కు సంబందించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ మద్య హార్వర్డ్ విశ్వవిద్యాలయం హై స్కూల్ గ్రాడ్యుయేట్ లో చేరిన మాలియా తన ఫ్రెండ్స్ తో చేస్తున్న ఎంజాయ్ మెంట్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..అయితే అందులో విశేషమేముందీ అనుకుంటున్నారా..! మాలియా స్మోకింగ్, గంజాయి లాంటి అలవాట్లు ఉన్నాయా అన్న అనుమానం వచ్చే రకంగా ఆ వీడియోలో మాలియా దర్శనమిస్తుంది.  

ఈ వీడియో లో మాలియా ఏదో సిగరెట్ లాంటిదాన్ని తాగుతున్నట్లు కనిపిస్తోంది.హార్వార్డ్ యూనివర్సిటీ లో చేరక ముందు ఓ మ్యూజియం ఫెస్టివల్ లో ఈ దృశ్యం చోటుచేసుకుంది.ఈ వీడియో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారడంతో ఆమె పై విమర్శలు రేగుతున్నాయి.

ఈ విషయంపై మాలియా స్నేహితులు ఆమెకు అండగా నిలుస్తున్నారు..మాలియాకు ఎలాంటి అలవాట్లు లేవని అవన్నీ పుకార్లే అని అంటున్నారు.  గిట్టనివారు ఇలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: