గాన కోకిల, కర్నాటక సంగీత విధ్వాంసురాలు, లెజండరీ గాయని  ఎంఎస్‌ సుబ్బలక్ష్మి కి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సైతం తన గొంతు వినిపించిన గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మికి అత్యంత అరుదైన గౌరవం దక్కనుంది. ఐక్యరాజ్యసమితి ఆమె శతజయంతి నేపథ్యంలో ఒక స్టాంపును విడుదల చేస్తోంది.ఐక్యరాజ్య సమితి పోస్టల్ పరిపాలన విభాగం 70వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధి చెప్పారు.

ఈ ఆగస్టు 15న ఐరాస జనరల్ అసెంబ్లీ వద్ద హాలులో లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం జరుగుతుంది. సుబ్బులక్ష్మి ముఖచిత్రంతో ఓ స్టాంపును విడుదల చేయాలన్నఐరాస నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో ఉన్న ప్రధాన హాలులో ఆస్కార్ విజేత ఏఆర్ రెహామాన్ తో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు అధికారులు.

ఐరాస దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే హాలులో భారత్ తరుపున 1966లో సుబ్బులక్ష్మి తన సంగీత కచేరీ చేయగా.. ఇప్పుడు ఆ అవకాశం రెహామాన్ కు దక్కడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: