తెలంగాణ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ నయీమ్ పోలీసుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే..అయితే ఎప్పుడైతే నయీమ్ మరణించాడో వెంటనే ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ, అనుచరులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా వేలాది కోట్ల రూపాయలు, నగలు, డాక్యుమెంట్స్ బయట పడుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నయీమ్ స్థావరాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో తవ్వేకొద్ది ఆస్తులు బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే నయీమ్ కేసలో పలువురు పోలీసలు బాస్ లు , రాజకీయన నాయకులు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భువనగిరి మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి పేరు బయటకురాగా ఆమె తనకు ఏం సంబంధం లేదని మీడియా ముందు క్లారిటీ ఇచ్చింది.

మాజీ డీజీపీ దినేష్ కూడా తనకు నయీమ్ కి ఎలాంటి సంబంధాలు లేవని మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరో మాజీ మంత్రి పేరు బయటకు వచ్చింది. అంతే కాదు ఆ మంత్రి ఫాంహౌజ్ నయీమ్ ఫాంహౌజ్ పక్కనే ఉండటం విశేషం. ఒకప్పుడు ఆ మంత్రి, నయీమ్ ఇద్దరూ కలిసి తిరిగినట్లు చాలా వరకు భూ దందాలు, సెటిల్ మెంట్లు చేసినట్లు వార్తలొస్తున్నాయి.  

డైరీలో ఈ అంశాలు నయీం ప్రస్తావించినట్లు తెలుస్తుంది.  ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరా అనుకుంటున్నారా..కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేసిన గ్రేటర్ హైదరబాద్ కి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉన్నా.. మరి దీనిపై నాగేందర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: