ప్రస్తుతం మన దేశ రాజకీయ వ్యవస్థను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనం కొన్ని విషయాలను స్పష్టంగా గమనించవచ్చు. మనదేశంలో ప్రాంతాలను బట్టి రాజకీయ వ్యవస్థలో మార్పులు కనిపిస్తాయి. ఒక ప్రాంతంలోని ప్రజలు ఒకలా ఆలోచిస్తే మరికొన్ని ప్రాంతల్లోని ప్రజలు మరోలా ఆలోచిస్తున్నారు. ఎవరి ఆలోచనలకు పొంతన కుదరకపోయినా వారి వారి విధి విధానాలను బట్టి పార్టీలకు జై కొడుతున్నారు. 



మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడతాయి. ఒక ప్రాంతంలో నివసించే ప్రజల ఆలోచనా విధానాలు, మరో ప్రాంతంలో నివసించే ప్రజల ఆలోచనా విధానాల్లో చాలా తేడాలను గమనించవచ్చు. ఒక ప్రాంతంలో ఒక పార్టీ ఘన విజయం సాధిస్తే మరో ప్రాంతంలో అదే పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వస్తుంది. మరి ఎందుకు ఇంత తేడా...? ఒక పార్టీ గురించి ఒక ప్రాంతంలోని ప్రజలు ఒకలా ఆలోచిస్తే.. మరో ప్రాంతంలోని ప్రజలు మరోలా ఎందుకు ఆలోచిస్తున్నారు...? 



గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను మనం ఒక సారి పరిశీలిస్తే ఈ విషయం పై మనకు ఒక స్పష్టమైన అవగాహన కులుగుతుంది. ఆ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఉత్తర భారతదేశ రాజకీయాలకు, దక్షిణ భారతదేశ రాజకీయాలకు స్పష్టమైన తేడా కనబడుతుంది. గత ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, అసోం, హర్యానా, జార్ఖండ్ లాంటి ఉత్తరభారత దేశ రాష్ట్రాల్లో మూస పద్ధతిలో మోడీకి అందరూ మద్దతు తెలిపితే, దక్షిణ భారతంలో మాత్రం ఫలితాలు అందుకు పూర్తిగా విరుద్ధం.



దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక్కొక్క పార్టీకి మద్ధతు పలికాయి. దక్షిణ భారతంలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలకే ఆదరణ లభిస్తుంది. ఒక్క కర్ణాటక రాష్ట్రం తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలో అక్షరాస్యత శాతం ఎక్కువ. ప్రజల ఆలోచనా విధానాల్లో కూడా ఈ రండు ప్రాంతాల్లో చాలా స్పష్టమైన తేడా కనబడుతుంది. 



ఈ రెండు ప్రాంతాల భాషా, జీవన విధానం, ఆలోచనా, సంస్కృతి, సాంప్రదాయాల్లో చాలా స్పష్టమైన తేడా కనబడుతుంది. అందుకే ఉత్తరభారతంలో కేంద్ర పార్టీకి మూస పద్ధతిలో ఓట్లు వేస్తే, దక్షిణ ప్రాతంలో మాత్రం మోడీ కి అసలు ఓట్లే రాలేదు. మోడీ మేనియా కేవలం ఉత్తరదేశంలో మాత్రమే ఫలించింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటనే.  


మరింత సమాచారం తెలుసుకోండి: