క్రీడ‌ల‌ను కెరీర్ గా ఎంచుకున్న ఎవ‌రికైనా ముందుగా వారు టార్గెట్ చేసేది ఒక్క‌టే, వారు స్వ‌ప్నిచేంది ఒక్క‌టే. వారు త‌పించే ఒక్క‌టే, అదే ఒలింపిక్ ప‌తకం. ఈ ప‌తకాన్ని సాధించేందుకు వారు ఎన్నో త్యాగాలు చేస్తారు. క‌ఠోర దీక్ష‌కు పూనుకుంటారు. ల‌క్ష్యం సాధించే వ‌రకు వారి ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ఈ క్ర‌మంలో చాలా మంది ఒలింపిక్ కు వెళ్లి కొంత‌వ‌ర‌కు ఫ‌లితాలు సాధించిర‌వారిని చూశాం. కానీ ఏక కాలంలో రియో ఒలింపిక్స్ - 2016 లో భార‌త్ కు ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించిన స్టార్ ష‌ట్ల‌ర్, తెలుగు తేజం పీవీ సింధు సాహ‌సం నిజంగా గ‌ర్వించ‌ద‌గ్గ‌దిగానే చెప్పుకోవ‌చ్చు. తొలి ప్ర‌య‌త్నంలోనే ఒలింపిక్ ప‌త‌కం ఒడిసిప‌ట్టి... రియో లో మ‌న దేశ గౌర‌వాన్ని నిల‌బెట్టి... స్వ‌దేశం లో అడుగు పెట్టిన సింధు.. ఆనంద డోలిక‌ల్లో తేలియాడుతుంది. 

పీవీ సింధు కుల‌, స్థానిక‌త‌పై గోపీ చంద్ క్లారిటీ...!


హైద‌రాబాద్ కు తిరిగి వ‌చ్చిన సింధు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సింధు గౌర‌వ సత్కారాలు అందుకుంటోంది. నిన్న తెలంగాణ స‌ర్కార్ స‌త్క‌రించగా... నేడు ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం సింధును స‌త్క‌రించ‌నుంది. ఒలింపిక్ మంచి ఫ‌లితాలు సాధించిన క్రీడాకారులు మంది చాలా అవ‌మానాలు ఎదుర్కోన్నారు. అయితే తాజాగా పీవీ సింధు సైతం స్థానిక‌త, కులం పై సోష‌ల్ మీడియా లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. దాదాపు కొన్ని లక్ష‌ల మంది నెటిజ‌న్లు సింధు స్థానిక‌త‌, కులం పై గూగుల్స్ ను సెర్చ్ చేశారని గూగుల్స్ సంస్థ ప్ర‌క‌టించింది. అయితే ఈ చ‌ర్చకు సింధు కోచ్ పుల్లెల గోపిచంద్ నిన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సౌమ్యంగానే ఇచ్చిన సదరు క్లారిటీ ద్వారా సింధు కులం కోసం వెంప‌ర్లాడిన నెటిజ‌న్ల‌కు ఆయ‌న భారీ షాకిచ్చారు.

అన్ని రాష్ట్రాలు ప్రొత్స‌హాలు ప్ర‌క‌టించాయి...

తెలుగు నేల‌కు చెందిన‌ప్ప‌టికీ సింధు... భార‌తీయురాలు అని గోపిచంద్ పేర్కొన్నారు. నిన్న హైద‌రాబాద్ లో మీడియా మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ  విష‌యం పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నేను ఒక్క‌మాట చెప్పాల‌నుకుంటున్నా... సింధు భార‌త్ కు చెందుతుంది. తెలంగాణ, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లు కూడా ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించాయి. త‌మిళ‌నాడు, ఒడిశా, క‌ర్ణాట‌క, ముఖ్య‌మంత్రులు సింధును పొగుడుతున్నారు. ఆమెను స‌పోర్టు  చేస్తున్నారు. ఇది చాలా గర్వ‌కారణం. ఈ వేడుక‌లో అంద‌రూ భాగస్వామ్యం కావ‌డాన్ని మ‌నం ఆస్వాదించాలి క్రీడ‌ల‌తోనే జాతీయ స‌మగ్ర‌త సాధ్య‌మ‌వుతుంది. అని అయ‌న వ్యాఖ్యానించారు.

ఎందుకు కుల ప్ర‌స్థావ‌న‌....

అయితే ఇక్క‌డ ఓ విష‌యం గురించి ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది. నాటి నుంచి  ప్ర‌పంచ దేశాల్లో ఎక్క‌డా లేని కుల ప్ర‌స్థావ‌న భార‌తదేశంలో ఉంటూ వ‌స్తోంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు గతంలో పుంకాలు పుంకాలుగా ఉన్నాయి. వాస్త‌వానికి చెప్పాలంటే... భార‌త‌దేశపు ఎదుగుద‌ల కేవలం కుల ప్ర‌స్థావ‌న‌తోనే ఆగిపోతుంది. గాంధీ మహాత్ముడు ఏ కులం వాడని దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టాడు?. అంబేడ్క‌ర్ ఏ కులం వాడ‌ని  భార‌త రాజ్యాంగాన్ని నిర్మించారు?  వారు తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు కేవ‌లం ఒక కులానికే ప‌రిమితం కాలేదు క‌దా! అలాంటిది ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి ప్రపంచ దేశాలు గ‌ర్వించ‌ద‌గ్గ పేరు సంపాదించి వ‌స్తే అన‌వ‌స‌రంగా ఎందుకు కుల ప్రస్తావ‌న‌? ఎందుకు ప్రాంతీయ విభేదం?  కాబ‌ట్టి అన‌వ‌ర‌సంగా మాట‌లు క‌ట్టిపెట్టి ప్ర‌తిభ ఉన్న వారిని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం నెటిజ‌న్ల కు ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: