పీవీ సింధూ పతకం తేవడం ఏమోగానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యనా పోటా పోటీగా మారింది వ్యవహారం. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో ఆమెకి అద్భుతంగా వెల్కం చెప్పింది తెలంగాణా ప్రభుత్వం. మొదట ఏపీ ప్రభుత్వం మూడు కోట్లు ప్రకటించగా దానికి పోటీగా తెలంగాణా ప్రభుత్వం ఐదు కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇతరత్రా బహుమతుల సంగతి చెప్పక్కర్లేదు. ముందుగా ప్రకటించేసి తానను వెనకపడ్డాను అని తెగ ఫీల్ అయిపోతున్నారట చంద్రబాబు .


క్రెడిట్ కొట్టేయడం విషయం లో కెసిఆర్ కంటే బాగా వెనకపడిపోయాని అని పర్సనల్ గా అనుకుంటున్నారట. పైగా నిన్నటికి నిన్న హైదరాబాద్ లో ఘనంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసి మరీ సింధూ ని సాదరంగా ఆహ్వానించి సిల్వర్ మెడల్ ని తమ ఖాతాలో వేసుకుంది తెలంగాణా ప్రభుత్వం సో చంద్రబాబు పరిస్థితి పాపం.. మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైపోయింది. కనీసం ఇచ్చిన డబ్బు విషయం లో అయినా వారితో సమతూగాలి అనేది బాబు ప్లాన్. ఇలోగా చంద్రబాబు కి డ్యామేజ్ కంట్రోల్ చేసే సలహా ఒకటి ఇచ్చారట లోకేష్ బాబు. ఇవాళ ఆమె కృష్ణా పుష్కరాలకి వచ్చి ఇక్కడ నీళ్ళలో మునగాబోతున్నారు ఈ సమయం లో ఆమెకి టీడీపీ ప్రభుత్వం తరఫున మరొక రెండు కోట్ల చెక్ ప్రకటిస్తారు.



ప్రకటించడమే కాకుండా ఘనంగా సన్మానం చేసి ఆ చెక్ తో పాటు మూడు కోట్ల చెక్ ని కూడా ఇవాళే ఇవ్వబోతున్నారు. ఈ రకంగా డబ్బు ముందే ఇచ్చినట్టు ప్రకటన చెయ్యాలి అని అనుకుంటున్నారు లోకేష్. తమ ప్రతిష్ట తమకి దక్కాలి అంటే తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్లకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి రెండు కోట్ల ప్లాన్ చెప్పాడట లోకేష్ బాబు. ప్రజల డబ్బు తో పాటు పార్టీ నుంచి కూడా పర్సనల్ గా ఇచ్చారు అనే ఫీలింగ్ ప్రజల్లో ఉంటుంది అనేది లోకేష్ ప్లాన్. కానీ మరి పార్టీ నాయకులు ఏమనుకుంటారో ? మరొక పక్క సింధూ క్రెడిట్ ని మొత్తం తమదే అనే ఊహలో ఉంటున్నారు టీడీపీ జనాలు.



దేశం లో అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు క్రీడాకారులకి భూములు ఇస్తూనే ఉన్నాయి ఎటొచ్చీ చంద్రబాబు ఇచ్చిన లాండ్ లో అకాడమీ పెట్టిన గోపీ చంద్ ద్వారా సింధూ కి పతకం వచ్చింది అంతే. అది తెలుగు దేశం పార్టీ ఘనతగా మార్చేసే ప్రయత్నాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే క్రెడిట్ అంతా తనదే అంటూ చంద్రబాబు డప్పు కొట్టుకోవడం మొదలు పెట్టేసారు. ఆయనకి వంత పాడుతూ మరొక ఇద్దరు మంత్రులు రెచ్చిపోవడం ఆసక్తికరం. సింధూ కి పతకం రావడం చంద్రబాబు దూర ద్రుష్టి కి నిదర్సనం అంటూ వారు కహానీలు చెబుతున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్టు ఉన్నాయి ఈరి వ్యాఖ్యలు.




అప్పట్లో ఎన్నో సంవత్సరాల క్రితమే కేరళ ప్రభుత్వం పీటీ ఉష కి స్థలం కేటాయించి అకాడమీ ఏర్పాటు చేసింది. ఎప్పుడో ప్రభుత్వం భూమి ఇవ్వగా తనకి తగ్గట్టుగా మార్చుకుంది ఉష. టింకూ లూకా అనే కోచ్ సహకారంతో పీటీ ఉష రాటుదేలింది. అలా స్థలం ఇచ్చిన వారు ఆమె మెడల్స్ గెలిచిన తరవాత డప్పు కొట్టుకోలేదు. " పీటీ ఉష , టింకూ లకి మేమే భూమి ఇచ్చాము . మా వల్లనే ఆమె గెలిచింది " అన్నట్టు వారు ఏ రోజునా మాట్లాడలేదు. కానీ టీడీపీ వైఖరి మాత్రం మారదు అన్నట్టు గా తయారు అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: