1993 ప్రాంతంలో ముంబాయిని గజ గజలాండించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భారీ పెళుళ్ల తర్వాత భారత్ ని వదిలి పాకిస్థాన్ పారిపోయాడు. అక్కడే ఇప్పటి వరకు తలదాచుకొని తన నెట్ వర్క్ నడిపించాడు.  అప్పటి నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భారత్ అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీకి సంబంధించి భార‌త్ అందించిన చిరునామాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి నిర్ధారించింది. దావూద్ పాకిస్థాన్‌లో తల‌దాచుకున్నాడంటూ మొత్తం తొమ్మిది అడ్రెస్‌ల‌ను ఐక్యరాజ్య‌స‌మితికి భార‌త్ అప్పగించింది.

అందులో మూడు చిరునామాల‌ను కొట్టిపారేసిన ఐక్య‌రాజ్య‌స‌మితి మిగతా ఆరు అడ్రెస్‌లను మాత్రం నిర్ధారించింది.యూఎన్ఓ వ్యాఖ్యలతో దావూద్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వస్తోందని భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లైంది. పాకిస్థాన్‌లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు కచ్చితమైన ఆధారాలు సంపాదించాయి.

 ఈ మేరకు దావూద్‌కు ఆశ్ర‌యం క‌ల్పించిన పాకిస్థాన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి స‌మ‌ర్పించిన లేఖ‌లో భార‌త్ డిమాండ్ చేసింది. భారత్ అందించిన ఆధారాలను ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని నిర్దారించింది.1993లో ముంబైలో జ‌రిగిన పేలుళ్ల కేసులో దావూద్ ప్ర‌ధాన నిందితుడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: