తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు నూతన ఉత్సాహం పొంగిపొర్లుతోంది. కొత్త జిల్లా ఏర్పాట్లు యమా హుషారుగా సాగుతోంది. దసరా రోజు నుంచీ ఎలాగైనా 27 జిల్లాల తెలంగాణా గా 10 జిల్లాల తెలంగాణా మారిపోవాలి అనేది కెసిఆర్ లెక్క. ఈ టార్గెట్ తోనే అధికార యంత్రాంగం అంతా పనిచేస్తోంది ప్రస్తుతం. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది కేవలం సాంకేతికంగా మాత్రమే మారుతుందా లేక అభివృద్ధి పథం లో కూడా ఎంతవరకూ వెళ్తుంది అనేది పెద్ద ఛాలెంజ్.



రెండు నెలల్లో ప్రతీ తెలంగాణా వ్యక్తి జీవితాల్లోకి ఈ కొత్త మార్పు రావడం తో పాటు సరికొత్త సమస్యలు కూడా రాబోతున్నాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకూ ఈ ఇబ్బందులు మొదట్లో చాలా కాలం ఎదురు అవుతాయి. సామాన్య వ్యక్తి దగ్గర నుంచి అధికారుల వరకూ అందరికీ కొత్త జిలాలు రావడం తో ఎన్నో దశాబ్దాలు గా ఉన్న జిల్లా పేరు మార్చుకునే అలవాటు ఉండదు. అడ్రస్ రాసే ప్రాతీ సారీ తాము ఏ జిల్లావాళ్ళం అని సరి జూసుకోవాలి, చూసుకుని మార్చుకోవాలి.



ఈ విషయం లో ఎక్కడ కొంచెం తేడా చేసినా ఇబ్బందిగానే ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఎమోషనల్ గా చాలా మంది తాము ఒకే జిల్లా తో అనుబంధం పెనవేసుకుని ఉంటారు తాను ఉండే ఊరు , ఊర్లోని బజారు, జిల్లా లోని ఊరిపేరు ఈ రకంగా వివిధరకాలు గా భావోద్వేగాలతో నడుస్తూ ఉంటుంది బండి. తాము అమితంగా ప్రేమించే జిల్లాలోంచి బయటకి ఒచ్చేసాం అని చాలా మంది ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇది సాధారణమే.



తాము ఫలానా జిల్లా వాళ్ళు అని ఫీల్ అయిన జనం ఒక్కసారిగా వేరే జిల్లా పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలామంది ఇబ్బంది ఫీల్ అవడం సహజం. కొత్త జిల్లాల కారణంగా ఇప్పటికే జిల్లాతో సంబంధాలు కలుపుకున్న వారు అంటే కూతురునీ కొడుకునీ అదే జిల్లాలో ఏరి కోరి మరీ ఇచ్చుకున్న వాళ్ళు దసరా తరవాత నుంచీ వేరు వేరు జిల్లాల వాళ్ళు అయిపోతుంటారు. దాదాపు వంద కిలోమీటర్ల కంటే తక్కువ దూరం లో విస్తీర్ణం ఉంటూ జిల్లాలు విభజించబడ్డాయి.



ఇవన్నీ పక్కన పెడితే కొన్ని జిల్లాల వాళ్ళు అనుకున్నది జరగలేదు అని అసంతృప్తి తో ఉన్నారు. పది జిల్లాలు 27 జిల్లాలుగా మారిన టైం లో అనుకున్నవారికి జిల్లాలు రాలేదు. కోరుకున్న జిల్లాలోకి వెళ్ళలేదు అనుకునేవారు మరికొంతమంది ఉండనే ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్సాహం ఒక పక్క దానికి భిన్నమైనట్టు గా అసంతృప్తిగా ఉన్న లక్షలాది మంది ఒక పక్క .. తెలంగాణా లో జిల్లాల గోల ఇలా సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: