ఇటీవలి తెలంగాణా లో శాసన సభ్యుల పార్టీ పిరాయింపులు, తెలుగు దేశం పాటీ విలీనం అంశంలో కూడా హైకోర్టు న్యాయమూర్తి ఎమ్.ఎస్.రామచంద్రరావు స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ శాసనసభలో టిడిపి పక్ష నేత రేవంత్ రెడ్డి - హైకోర్టులో పిటిషన్ వేస్తూ స్పీకర్ తొలుత తన ముందు ఉన్న అనర్హత పిటిషన్ లను పరి ష్కరించకుండా, టిడిపి ఎమ్మెల్యేలు కొందరు ఇచ్చిన విలీన పిటిషన్ ను ఆమోదించడాన్ని తప్పు పట్టారు.ఈ కేసు విచారణ లో ఒక దశలో తెలంగాణ ఎ.జి రామకృష్ణారెడ్డి కి, న్యాయమూర్తి కి మద్య హాట్ కామెంట్స్ నడిచాయని వార్తలు వచ్చాయి.ఎ.జిని ఉద్దేశించి స్వరం పెంచవద్దని న్యాయమూర్తి అంటే, తన వాదనను  అడ్డుకోజాలరని ఆడ్వ కేట్ జనరల్ పేర్కొన్నారు. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు. శాసనసభ కార్యదర్శి తరుపున వాదిస్తానని ఎ.జి అనగా, ఇందులో కార్యదర్శి ప్రమేయం ఏముందని, శాసన సభ సభాపతి కు సంబందించిన విషయం కదా ఇది అని జడ్జి వ్యాఖ్యానించారు.

 Image result for Assembly Telangana - madhusudhana chary

తెలంగాణా లో ఫిరాయింపులకు సంబందించి  గట్టిగానే వ్యాఖ్యానించడం -అంధ్రప్రదేశ్ కు సంబందంచి "స్విస్-చాలెంజ్" పై కూడా ఘాటుగా స్పందించిన జడ్జి రామచంద్రరావు అబినందించదగ్గ విషయమే అవుతుంది.

 Image result for Assembly Telangana -

ఈ రెండు కీలకమైన విషయాలపై జడ్జి రామచంద్రరావు ఎలాంటి తీర్పులు ఇస్తారన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ మద్య కాలంలో బహుశా మొదటి సారి హైకోర్టులో అంధ్రప్రదేశ్ కు ఎదురు దెబ్బ తగిలింది.  స్విస్ చాలెంజ్ విదానంపై హైకోర్టు ఆక్షేపణ తెలపడం విశేషమే.  స్విస్ - చాలెంజ్ విధానం కన్నా , సీల్డ్ కవర్ విధానమే బెటర్ అని హైకోర్టు స్పష్టం చేసింది.  విదేశీ కంపెనీల ప్రయోజనం కన్నా, ప్రజా ప్రయోజనాలనే పరరక్షించవలసిన అవసరం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని?  హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం వ్యవహారంలో ఆదాయ వివరాలను బహిరంగ పరచకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. స్విస్ ఛాలెంజ్‌కు సంబంధించిన అన్ని విషయాలను బహిర్గతం చేయాల్సిందే నని గతంలో ఇదే హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం గుర్తు చేయడం గమనించదగిన అంశమే.

 Image result for assembly ap

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునేందుకు అవి అధికారుల వ్యక్తిగత ఆస్తులు కావని, ప్రజల ఆస్తులని, ఆ ఆస్తులకు అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని వ్యాఖ్యా నించింది. రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు (స్విస్-చాలెంజ్) ఆహ్వానిస్తూ జారీ అయిన టెండర్ నోటిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేలా "మధ్యంతర ఉత్తర్వులు"  ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయాన్ని ఈ నెల 26వ తేదీన వెలువరిస్తామని తెలిపింది. Image result for andhra pradesh swiss challenge

ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ గత నెల 18న సీఆర్‌డీఏ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ జారీ అయ్యాయి. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ కంపెనీ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ బి.మల్లికార్జునరావు పిటిషన్ దాఖలు చేశారు. 

వాదనలు ముగిశాయి. తీర్పులు రిజర్వయ్యాయి (?) వెల్లడయ్యేవరకు ఎదురు చూద్ధాం.  

Image result for andhra pradesh swiss challenge

మరింత సమాచారం తెలుసుకోండి: