ఈ మద్య నిరసనలు చాలా విచిత్రంగా తెలుపుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు చాలా మంది. ముఖ్యంగా వేదికపై ఉన్న వారిపై చెప్పులు, బూట్లు విసురుతూ నిరసన తెలుపుతున్నారు. తాజాగా తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలో ఓ కలెక్టర్ పై చెప్పు విసరడంతో పెద్ద సంచలనం రేపింది.  అసలు విషయానికి వస్తే.. వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి తనకు బ్యాంకు నుంచి రుణాలిప్పించలేదన్న కోపంతో జిల్లా కలెక్టర్‌పై దాడికి యత్నించడం కలకలం రేపింది.

జిల్లా కలెక్టర్‌ ఆసియా మరియం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు పాల్గొని వినతిపత్రాలు అందజేశారు..అదే సమయంలో ఓ వ్యక్తి తన పాదరక్షలను తీసి కలెక్టర్ పై విసిరాడు..కానీ అది పక్కన ఉన్న అధికారిపై పడటంతో వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

అదుపులో తీసుకుని విచారణ జరపగా అతని పేరు ఆర్ముగం (55) అని, సిద్దవైద్యుడని తెలిసింది.  గత కొంత కాలంగా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయానని అందుకే కోపంతో చెప్పుతో దాడి చేసినట్లు తెలిపాడు. ఈ సంఘటనకు సంబంధించి నల్లిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: