మనం బాంకు లో ఋణం తీసుకుంటే ఆ ధనాన్ని ఒక స్టేట్-మెంట్ రూపములో ఏతారీకు నాడు? ఎందుకోసం? ఏలా? ఎంత మొత్తం? ఆనాటికి ఎంత మిగులుంది? ఇలాంటి విషయాలు సమర్పించవలసి ఉంటుంది. అలా సమర్పించిన వివరాలు పరిశీలించి సరిగా వినియోగమైనదని భావించినప్పుడే మరో విడత ఋణాన్ని విడుదల చేయటానికి అంగీకరిస్తుంది.

 Image result for amaravathi sankusthapana

దీన్నే ఆర్ధిక పరిభాషలో "ఎండ్-యూజ్" అంటారు. అలాగే ఐ ఎం ఎఫ్ లాంటి సంస్థలు కూడా దేశానికి ఋణం, గ్రాంట్ ఇలాంటి పేర్ల క్రింద ఇచ్చిన సొమ్ముకు "ఎండ్-యూజ్" గురించి తెలుసుకుంటాయి. సమస్య ఏమిటంటే కేంద్రం రాష్ట్రాలకిచ్చే నిధులగురించి లెక్కచెప్పమంటే ఆలోచనెందుకు? ఖర్చు పెట్టిన సొమ్ము వివరాలు అందిస్తే సరిపోతుంది.

  Image result for funds & grants to AP

కేంద్ర ప్రభుత్వానికి , అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విషయములో విభేదాలు కొన సాగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన 1976 కోట్ల విషయంలో షరతులతో  నిదులు మంజూరు చేసిందని సమాచారం. షరతులు ఎవరూ పెట్టరు ఆ మంజూరిలోనే షరతులు ఉంటాయి. ఇంతవరకు కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరుతుండగా, వాటిని ఎలా పంపాలా అన్నదానిపై రాష్ట్రం తర్జనభర్జనలు పడుతోంది.

 Image result for amaravathi sankusthapana

రాష్ట్రం తర్జన బర్జనలు పడవలసిన అవసరంలేదు తాను విధానం ప్రకారం ఖర్చు పెట్టినట్లయితే. కాని ఒక ఉద్ధేశ్యంతో కేంద్రం నిధులిస్తే వాటిని దారి మళ్ళిస్తేనే ఇబ్బంది. అప్పుడు అది ఒక స్కాముకు దారితియ్యవచ్చు. మనదేశములో జరిగే స్కాములన్నిటిలోనూ ఈ విధంగా దారిమళ్ళించిన సంఘటనలు తక్కువేమీ కాదు. "నిధుల దారి మళ్ళింపు" పేరుతో అనేక వార్తలు చూస్తూనే ఉంటాం. ఇలా దారిమళ్ళించే ప్రభుత్వాలకు కేంద్రం నిధులివ్వ నవసరం లేదు. ఎందుకంటే కేంద్ర పద్దులూ కూడా ఆడిట్ అవుతాయి. అలాంటప్పుడు వారు సమాధానం చెప్పాలి కదా! 

Image result for amaravathi sankusthapana 

ఇంతవరకు ఇచ్చిన ఆరువేల కోట్ల కు పైగా నిదులు విడుదల కాగా, వాటిని ఖర్చు చేసిన తీరుపై రాష్ట్రం పంపిన నివేదికల మీద కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిందని మీడియా కదనం. తాము ఏ అవసరం కోసం పంపామో,వాటికి సంబందించి ఎలాంటి ఖర్చు క్షేత్ర స్థాయిలో ఉపయోగించింది లేనిదీ చెప్పాలనీ, ఇప్పటికి అలాజరగక పోతే ఆ సొమ్మును ఇప్పటికైనా ఉద్దేశించిన అవసరానికి వాడి ఎండ్-యూజ్ సమర్పించవచ్చు. లేకపోతే ఆ సొమ్ము వాపస్ చేయవచ్చు.

 Image result for amaravathi sankusthapana

ఉదాహరణకు వెనుకబడిన జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు మంజూరుచేస్తే, అందులో క్షేత్ర స్థాయిలో ఖర్చు అయింది చాలా తక్కువగా ఉందట. రాజధాని అబివృద్దికి 2050 కోట్లు పంపితే, ఆ అవసరాలకు ఖర్చు చేసింది దాదాపు లేదు. ఇలా ఆయా నిధుల వినియోగంపై తేడాలు వస్తుండడంతో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పట్టిసీమ, పుష్కరాలు, తాత్కాలిక రాజదాని, అనేక సార్లు ప్రారంభోత్సవాలు, పివి సింధు లాంటి వాళ్ళకు నజరానాలకు (రచయిత దృష్టిలో నజరానాలు యివ్వటం తప్పు కాదు - దానికి కొన్ని పద్దతులుంటాయు) పండుగలు పబ్బాల పేర్లతో నిధుల దుబారా చెయ్యటం మొదలైనవాటికి నిధులను మళ్లించారని చెబుతున్నారు. కేంద్రం నిదులకు వాస్తవ లెక్కలు సిద్దం చేయడం ఇబ్బంది కరమేనని ఒక అదికారి అన్నారు. ఇవన్నిటివలన అసలు కేంద్ర ఉద్దేశం, రాష్ట్ర అవసరం రెండూ పూర్తవ్వవు.

 Image result for amaravathi sankusthapana

అప్పుడు దేశ అత్యున్నత ఆడిట్ వ్యవస్థ "కనంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జెనరల్ ఆఫ్ ఇండియా" తప్పులెత్తి చూపుతారు. తరువాత పరిణామాలు ధారుణంగా ఉంటాయి. ఉదాహరణకు స్పెక్ట్రం స్కాంలో రాజా, కనిమోళికి ఏగతి పట్టిందో అందరికీ తెలుసు. అందుకే మోడీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుంది.


కాగ్ ఎక్స్-పోజెస్ లాండ్ స్కాం ఇన్ అంధ్రప్రదేశ్

Image result for cag of india and Andhra pradesh

అందుకే ఏపి ప్రభుత్వం అసహనం తో అల్లడి తల్లడి అవుతూ కేంద్రాన్ని నిందించి తనకు రావలసినవి రాబట్టుకోలేక బట్టలు తడుపుకోవటానికి ఇదీ ఒక కారణం. ఈ ప్రభుత్వ ఆర్ధిక విధానాల్లో లోపాలవల్లే కావచ్చు అంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుంది. ప్రజలు ప్రభుత్వంపై వత్తిడి పెంచితే కేంద్రంపై వత్తిడి పెరగొచ్చు లేకుంటే ఏపి ప్రభుత్వం నేరగ్రస్థ గా మిగలోచ్చు. చూద్ధాం ఏమవుతుందో?

Image result for cag of india

మరింత సమాచారం తెలుసుకోండి: