కొన్ని కొన్ని ఇలాగే జరగాలి , వేరేలా జరిగితే తేడాగా అనిపిస్తుంది .. " ఇదేంటి కొత్తగా " అనిపిస్తుంది జనాలకి. వినడానికి, చూడడానికి వింతగా ఉండేవి బోలేడు ఉంటాయి. కేంద్ర మంత్రి వెంకయ్య - ఈనాడు పేపర్ కి విడదీయలేని అనుబంధం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీ రోజూ వాళ్ళ న్యూస్ లో ఎదో ఒక మూల వెంకయ్య గురించి రాస్తూ ఉంటారు ఈనాడు వారు. ఇదేదో వారి డీల్ లో భాగమో ఏమో గానీ వెంకయ్య అలా అన్నారు, వెంకయ్య ఆ ఓపెనింగ్ చేసారు , ఇలా మాట్లాడారు అంటూ ఎదో ఒక న్యూస్ కనపడి తీరాల్సిందే.

 

కానీ ఆశ్చర్యంగా ఆయన కి సంబంధించిన అంటే స్వయంగా ఆయనే రాసిన ఒక ప్రత్యేక వ్యాసం ఇప్పుడు సాక్షి దినపత్రిక లో కనపడింది. సాక్షి  వారు బీజేపీ వార్తలు రాయరు అనో లేక బీజేపీ సాక్షి ని నిషేధించింది అనో కాదు గానీ ఈనాడు తో వెంకయ్య కి ఉన్న అనుబంధానికీ, సాక్షి తో ఈనాడు కి ఉన్న శత్రుత్వం కీ ఎక్కడా పొసగట్లేదు. చాలా మంది కమలం పార్టీ నేతల ప్రత్యేక వ్యాసాలు సాక్షి ఎడిటోరియల్ లో కనిపిస్తాయి. పార్టీ తరఫున తమ వాదన వినిపించడం కోసం తమని తాము డిఫెండ్ చేసుకోవడం కోసం నేతలు ఈ తరహా వ్యాసాలూ రాసి పత్రిక ఆఫీసులకి పంపిస్తూ ఉంటారు. కానీ వెంకయ్య గారి వ్యాసం ప్రచురితం కావడం అంటే ఖచ్చితంగా వింతే .. వెంకయ్య కి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే పేపర్ గా ఈనాడు కి మంచి పేరుంది.

 

 

దేశ విదేశాల్లో వెంకయ్య ఏ కార్యక్రమం లో పాల్గొన్నా కూడా ఈ పేపర్ లో హెడ్ లైన్ ఉంటుంది. బీజేపీ ప్రతిపక్షం లో ఉన్న రోజుల్లో అయితే వెంకయ్య వార్త ఈనాడు మహా ప్రసాదంగా తీసుకునేది. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయ్యాక పెద్ద పెద్ద న్యూస్ లు , వ్యాసాలూ రాస్తున్నారు. ఈ మధ్యన ఆయన రాజ్యసభ సభ్యత్వం విషయం లో కూడా వెంకయ్య కి వ్యతిరేకంగా కర్ణాటక బీజేపీ శ్రేణులు ర్యాలీలు చేస్తే వెంకయ్య కు సభ్యత్వం ఇవ్వడానికి ఈయా రాష్ట్రాల బీజేపీ శాఖలు పోటీలు పడి కొట్టుకుంటున్నాయని ప్రత్యేక కథనాలు వచ్చాయి. ఈనాడు వ్యాసాల్లో కూడా ఆయనకి పెద్ద పీట ఉంది. ఖైరతాబాద్ లోని ఈనాడు ఆఫీస్ అడ్రస్ మారి ఆ వ్యాసాలు ఇప్పుడు సాక్షి లో అచ్చు అవుతూ ఉండడం ఆశ్చర్యంగా లేదు ?

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: