జ్యోతిషం అనేది మానవుని ప్రతి అడుగులో సూచనలు ఇస్తూ అందరిని ముందుకు తీసుకువెళ్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా నీ ఖర్మకు నీవే భాద్యుడవు, ఈ విషయాన్ని జ్యోతిషం స్పష్టంగా తెలియజేస్తుంది. గత 5 సంవత్సరాలుగా నక్షత్రసిద్ధాంతం లో డా. ఎన్ వి ఆర్ ఏ రాజా గారు నక్షత్రాలు మానవుని పైన ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయం పైన పరిశోధనలు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో జాతీయ జ్యోతిషసదస్సు. ఆగస్టు 28 న జే కే ఆర్ ఆస్ట్రోరీసెర్చ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. వివిధరాష్ట్రాల నుండి స్పీకర్స్ ఇందులో పాల్గొంట్టున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం యోగసంస్కృతం యూనివర్సిటీ నుండి జ్యోతిషంలో పీహెచ్డీ చేసిన వారికి డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి డా. చంద్రవదన్,ఐఏఎస్, జస్టిస్ లింగం నర్సింహారెడ్డి ఫార్మర్ - ఏపీ,  అండ్ పాట్నా హైకోర్టు జడ్జి , ప్రత్తిపాటి పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు , బి వి కె శాస్త్రి విసి యోగసంస్కృతం యూనివర్సిటీ అలాగే డా. ఎన్ వి ఆర్ ఏ రాజా , చైర్మన్ జే కే ఆర్ ఆస్ట్రోరీసెర్చ్ ఫౌండేషన్ మొదలైన వారు పాల్గొంటారు. జే కే ఆర్ ఆస్ట్రోరీసెర్చ్ ఫౌండేషన్ జ్యోతిషం అనేది సైంటిఫిక్ గా నక్షత్రాలతో ముడిపడిన శాస్త్రమని వీటిని అందరికి అందివ్వాలనే భాగం డా . రాజా గారు కృషిచేస్తున్నారు.

వివిధ రాష్ట్రాలనుండి ఈ కార్యక్రమానికి ప్రముకజ్యోతిషులు వస్తున్నారు వీరిలో ప్రభాకర్ కశ్యప్ , బెంగుళూరు. చంద్రశేఖర తివారి, ఫరీదాబాద్. ప్రొఫెసర్ ఆండ్రూదత్త , డా రవిరావ్ ,డా.కే స్ చరక,ఢిల్లీ మొదలైన వారై తమ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జ్యోతిషఅభిమానులు అందరు పాల్గొనవచ్చును. గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా జ్యోతిషం అనేది పురాతనమైన భారతీయ శాస్త్రమని అలాగే దీనిపైన మరింత చర్చఅవసరం అని వ్యాఖ్యానించింది. భారతీయ అతిగొప్పశాస్త్రమైన జ్యోతిషంలో జరుగుతున్న ఈ జాతీయసదస్సు ప్రాముక్యతను సంతరించుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: