ఇన్ని రోజులు కమలదలం తో దోస్తీకి కాస్త మొహమాట పడిన తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు కమలం పార్టీతో చెట్టాపట్టాలేసుకొని తిరగడానికి తెరాస ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎడ మొహం పెడ మొహం వేసుకున్న రెండు ప్రభుత్వాలు దోస్తీకి సిద్ధం అవుతున్నాయి. ఇటీవల మోడీ తెలంగాణ పర్యటన సక్సెస్ అయిన నేపథ్యంలో మహారాష్ట్ర తో గోదావరి జాలాల ఒప్పందం కుదుర్చుకోవడంలో కేంద్రం తెలంగాణ కు సహాయపడినందున ఇక శత్రుత్వాన్ని దాదాపుగా వీడినట్టే అని స్పష్టం అవుతోంది. 


Image result for gst bill

కేంద్రం పార్లమెంట్ లో ఇతావల జీఎస్టీ బిల్లు ఆమోదం తెలిపిన విషయం అందరికీ విదితమే. అయితే రాష్ట్రాలు కూడా అసెంబ్లీ లో జీఎస్టీ బిల్లును ఆమోదపరచాలని ఆదేశాలు జారీ చేయడంతో బీజేపీ పరిపాలనేతర రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును పాస్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఈనెల 30న శాసనసభ, శాసనమండలిని సమావేశపరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


Image result for telangana

 ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలని శుక్రవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలను కోరారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం అమల్లోకి రావాలంటే దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. 


Image result for kcr modi

అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు సభలను సమావేశపరచాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కావడంతో సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి ఏజీ రామకృష్ణారెడ్డిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కోరారు. ఇక ప్రతిపక్షాలు కోరితే వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశముంది. బీఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది ఖరారవుతుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: